Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. #SSMB28 అప్డేట్ వచ్చేసిందోచ్..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న #SSMB28 అప్డేట్ వచ్చేసింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై రూపొందుతుంది.. తాజాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు.. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..! ప్రియమైన సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

#SSMB28 మోస్ట్ అవైటెడ్ కాంబో షూట్ కోసం అంతా సిద్ధంగా ఉంది నాచ్ కెమెరాలతో హై యాక్షన్ సీక్వెన్స్ షూట్ ఈరోజు ప్రారంభం కానుంది.. #SSMB28 షూటింగ్ మొదలైంది మా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని తెలియజేస్తూ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టును విడుదల చేయగా.. అది నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు..

Mahesh Babu trivikram #SSMB28 movie shooting begans today
Mahesh Babu trivikram #SSMB28 movie shooting begans today

ముందు నుంచి అందరూ అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమా షూటింగ్ ఓ ఫైవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభం కానుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు.. ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు..

Advertisement