Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్ కి గుండె ముక్కలయ్యే బ్రేకింగ్ : ఆ సినిమా ఆపేస్తున్నారు.!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.. మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రానంది అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి.. పుష్కరకాలం తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.. ఈ సినిమా #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా ఆగిపోయింది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..

Advertisement
Mahesh Babu trivikram #SSMB28 movie postponed
Mahesh Babu trivikram #SSMB28 movie postponed

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా ఆగిపోతుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలు నిజమంతుందో తెలియదు కానీ ఈ విధమైన వార్తలు రావడం మహేష్ బాబు అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.. ఇటు త్రివిక్రమ్ అభిమానులు కూడా ఈ వార్త నిరుత్సాహపరుస్తుంది.. కారణాలు ఏవైనా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే వదిలేసి హాలిడే ట్రిప్ కు వెళ్లడం ఇలాంటి వార్తలకు ఆద్యం పోసిందనే చెప్పాలి.. ఇటీవల ఆయన తిరిగి రావడం కూడా జరిగింది.. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో ఈ విధమైన వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మహేష్ బాబుకు ఈ సినిమాల్లోని స్క్రిప్ట్ లో కొన్ని డౌట్లు వచ్చాయట.. వాటిని హాలిడే నుంచి తిరిగి వచ్చేలోపు క్లియర్ చేయమని త్రివిక్రమ్ కు మహేష్ బాబు సూచించారట.. అయితే మహేష్ ట్రిప్ ముగించుకుని వచ్చాక కూడా త్రివిక్రమ్ ఆ డౌట్లను ఇంకా నివృత్తి చేయలేకపోవడంతో.. మహేష్ ఈ సినిమాను చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోయారట..

Advertisement

నిజానికి త్రివిక్రమ్ ఈ సినిమాను అనౌన్స్ చేయడానికి ముందే ఈ స్క్రిప్ట్ పై చాలా కసరత్తులు చేశారట.. ఎలాగోలా మహేష్ బాబును ఒప్పించిన త్రివిక్రమ్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్లో ఏర్పడిన కొన్ని సందేహాలను తీర్చి మహేష్ బాబును మళ్ళీ కన్విన్స్ చేయడంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడని సినీ ఇండస్ట్రీలో ఓ వార్త గట్టిగా వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను ఏ విధంగా కంప్లీట్ చేస్తాడా అనేది చూడాలి.. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అందరూ అనుకుంటున్నారు.. మరి ఈ సినిమాపై త్వరగా ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తే కానీ ఇలాంటి అపోహలు తొలగిపోవనే చెప్పాలి..

ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంపిటీషన్లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. అయితే మహేష్ రాజమౌళితో సినిమా చేశాకంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేసి హిట్ కొట్టాలని అనుకున్నాడట.. రాజమౌళి సినిమా కంటే ముందే ఓ సినిమా తీసి హిట్ కొడితే వాళ్ళిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కూడా సెట్ అయిందన్న సంతృప్తి ఉంటుందని మహేష్ అనుకున్నాడట.. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఆ స్క్రిప్టులో ఉన్న సందేహాలను నివృత్తి చేయలేకపోయాడు.. త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని.. ఓ అనౌన్స్మెంట్ వస్తే ఇలాంటి వార్తలు అన్నింటికి చెక్ పెట్టవచ్చు.. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి..

Advertisement