Mahesh Babu : ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తోన్న నిర్ణయం తీసేసుకున్నమహేష్ బాబు .. తండ్రి చనిపోయిన రెండో రోజే !

Mahesh Babu: ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో ఈ ఏడాది మూడు విషాద సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది మొద‌ట్లో మ‌హేష్ అన్న ర‌మేష్ బాబు కాలం చేయ‌గా, కొద్ది రోజుల‌కి మ‌హేష్ త‌ల్లి ఇందిరా దేవి క‌న్నుమూసారు. ఇక నవంబ‌ర్ 15న కృష్ణ కాలం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ బయలుదేరి వ‌చ్చి చివ‌రి సారిగా కృష్ణ‌ని క‌డ‌సారి చూసుకున్నారు. పద్మాలయ స్టూడియోలో అభిమానుల సంద‌ర్శ‌నార్థం కృష్ణ భౌతిక కాయాన్ని ఉంచి అనంత‌రం మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Advertisement
mahesh-babu-takes-stunning-decision-2
mahesh-babu-takes-stunning-decision-2

మ‌హేషా, మ‌జాకానా..

Advertisement

అయితే కృష్ణ లాంటి లెజండ‌రీ న‌టుడు అంత్య‌క్రియ‌లు ప్రైవేట్ స్థ‌లంలో నిర్వ‌హించ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. కృష్ణ‌కి చాలా స్థ‌లాలు ఉండే ఉంటాయి క‌దా, అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వహించి చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే బాగుండేద‌ని కొంద‌రు త‌మ అభిప్రాయాలని వ్య‌క్తప‌రిచారు. ఇటీవల కృష్ణంరాజు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించారు. నందమూరి తారక రామారావు మరణించినప్పుడు ప్రభుత్వ స్థలంలో దహన సంస్కారాలు నిర్వ‌హించి ఎన్టీఆర్ ఘాట్ ని ఏర్పాటు చేసారు. అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్వహించిన విష‌యం తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయా స్టూడియోస్ లో నిర్వహించిన బాగుండేది క‌దా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మ‌హేష్ బాబు త‌న అన్న‌, త‌ల్లి అంత్య‌క్రియ‌లు మ‌హాప్ర‌స్థానంలో జ‌రిగాయి కాబ‌ట్టి అక్క‌డే తండ్రివి కూడా నిర్వ‌హించాల‌ని అనుకున్నాడ‌ట‌. తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉండే మ‌హేష్ బాబు అలా చేయ‌డం వెన‌క ప్ర‌త్యేక‌మైన కార‌ణం త‌ప్ప‌క ఉంటుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయితే కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ప్లాన్ వేస్తున్నాడ‌ని టాక్ నడుస్తోంది. అందులో కృష్ణ సినిమాలకు సంబంధించిన వివ‌రాలు మరియు అవార్డులను అందులో ఉంచాలని అనుకుంటున్నారట. పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం.

Advertisement