Mahesh Babu : ఆ షో రేటింగ్ మహేష్ బాబుకి ఛాలెంజ్.. అన్ని కోట్లు తీసుకున్నాడా !?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో పాటు ఇటు యాడ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మహేష్ ఈ పేరు వినపడింది అంటే చాలు చుట్టుపక్కల ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందరూ చూపు మహేష్ పైనే ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.. మహేష్ ఒక టీవీ షో లో అది కూడా డాన్స్ షో కి మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు.. అలా రావడం వెనుక కచ్చితంగా ఆ షో టి ఆర్ పి రేటింగ్ పెరగడం కోసమేనని.. అందుకోసం ఆ ఛానల్ భారీ మొత్తంలో మహేష్ కు చెల్లించిందని వార్తలు వినిపిస్తున్నాయి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షోకి గెస్ట్ గా వచ్చారు.. తనతో పాటు తన గారాల పట్టి సీతారాం కూడా తీసుకువచ్చాడు.. ఈ షో కి నేను రావడానికి ప్రధాన కారణం సితారని తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం.. తన కోసమే ఈ షో కి వచ్చానని డైరెక్ట్ గా మహేష్ చెప్పేసాడు.. గత రెండు వారాలుగా మహేష్ జీ తెలుగులో ప్రసారం కానున్న షోకి హాజరవుతున్నాడని విడుదల చేయక నెట్టింటా తెగ వైరల్ అయింది.. ఈ షో చూడటానికి అటు సినీ ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి ఈ షో ప్రసారం అయింది.. మహేష్ ముఖం పైన చెరగని చిరునవ్వు. సందర్భానుసారంగా మాట్లాడటం.. మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాయి..

Mahesh Babu taken 9 crores on Zee telugu show
Mahesh Babu taken 9 crores on Zee telugu show

అయితే జీ తెలుగు లో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షో టి ఆర్ పి రేటింగ్ పెంచుకోవడం కోసమే మహేష్ బాబును ఈ షోకు గెస్ట్ గా పిలిచిందని టీవీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తుంది. మరోవైపు మహేష్ బాబు ఈ షోకి రావడానికి అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకున్నారని టీవీ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే ఈ ఇందులో నిజమంతుందో తెలియదు కానీ లీకులు మాత్రం ఊరికే రావు కదా.. మహేష్ బాబు ఈ షోలో సందడి చేయడంతో పాటు సితార కూడా మరోసారి స్టేజిపై డాన్స్ వేసి అందరినీ అలరించింది. ఇక ఇదే రోజు స్టార్ మా లో బిగ్బాస్ సీజన్ 6 కూడా మొదలైంది. అందుకే మహేష్ బాబు రాకతో డాన్స్ ఇండియా డాన్స్ షో టి ఆర్ పి రేటింగ్ పెంచుకోవాలని జీ తెలుగు ప్లాన్ చేసిందని.. నాగార్జున ను బీట్ చేయడం మహేష్ బాబు వల్లే అవుతుందని జీ తెలుగు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది..

Advertisement