Mahesh Babu : పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అలా చెప్పి సర్ప్రైజ్ చేసిన మహేష్ బాబు..!!

Mahesh Babu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు.. ఈ రోజు ఆయన అభిమానులకు పండుగ రోజు.. నెల రోజుల ముందు నుండే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేసుకున్నారు.. సోషల్ మీడియాలో ఇక పవర్ స్టార్ పుట్టిన రోజున విపరీతమైన సందడి చేస్తున్నారు.. రెండు రోజులుగా జల్సా, తమ్ముడు చిత్రాల స్పెషల్ షోలతో తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కళకళలాడుతున్నాయి.. ఫ్యాన్స్ పవన్ బర్త్ డే కి ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు..!! నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు..! ఈ సందర్భంగా ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు, రాజకీయ వేత్తలు బర్త్డే విషెస్ తెలియజేశారు..!

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు..! ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది..! సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్.. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగు చేయాలని.. మీరు అనుకున్న పనులు ద్విగ్విజయంగా నెరవేరాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ ట్వీట్ చేశారు.. టాలీవుడ్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు అతిపెద్ద ఫ్యాన్ వేసిన కలిగి ఉన్నారు. తరచుగా పవన్ మహేష్ ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది.. అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు బర్త్డే విషెస్ తెలియజేయడం వైరల్ గా మారింది..

Mahesh Babu special wishes on Pawan Kalyan birthday
Mahesh Babu special wishes on Pawan Kalyan birthday

సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల బర్త్డేలను మర్చిపోకుండా విష్ చేసే గొప్ప సంప్రదాయం మహేష్ చాలా కాలంగా పాటిస్తున్నారు.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను తెలుపుతూ.. పవన్ కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. చిరంజీవి తన ట్విట్టర్లో .. తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. ఆశీర్వదిస్తూ కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.. ప్రస్తుతం చిరంజీవి, మహేష్ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..