లండన్ లో రజిని బ్లాక్ బస్టర్ “జైలర్” మూవీ చూసిన మహేష్ కొడుకు వీడియో..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా “జైలర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. సినిమా విడుదల ఈ వారం రోజులు కావస్తున్నా గాని కలెక్షన్స్ ఏమాత్రం తగ్గటం లేదు. యూఎస్ లో సైతం.. రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఇదే రీతిలో తెలుగు రాష్ట్రాలలో సైతం సంచలన నెంబర్స్ నమోదు చేసిన జైలర్.. పూర్తి రన్ టైంలో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మాణ సారధ్యంలో నెల్సన్ దిలీప్ కుమార్ అందించిన దర్శకత్వానికి..

Mahesh Babu Son Goutham Scored grade 10 in 10th Class
Mahesh Babu Son Goutham Scored grade 10 in 10th Class

అనిరుద్ ఇచ్చిన బాణీలు సినిమా మొత్తానికి హైలైట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ జైలర్ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాని మహేష్ బాబు కొడుకు గౌతమ్ లండన్ లో తిలకించడం జరిగింది. మహేష్ కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి.. గౌతమ్ లేటెస్ట్ గా “జైలర్” సినిమాని చూడడం జరిగిందంట. లండన్ లో గౌతమ్ జైలర్ మూవీ చూసి బయటకు వస్తున్న దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా మహేష్ కొడుకు గౌతమ్ కంటే సితార ఎంటర్టైన్మెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. సితార చిన్న వయసు నుండి డాన్స్ ఇంకా రకరకాల విదేశీ ప్రదేశాలకు వెళ్లిన వాటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటది. కొడుకు గౌతమ్ చాలా సైలెంట్. అటువంటిది లండన్ లో ఏకంగా రజిని మూవీ జైలర్ సినిమాని గౌతమ్ చూసినట్లు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.