Mahesh Babu : మహేష్ బాబు పై ఇలా చేస్తాడని అనుకోలేదన్న నమ్రతా..! అసలు ఏమైందంటే.!?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల కూతురు సితారతో కలిసి మొదటిసారి టెలివిజన్ షోకు హాజరయ్యాడు.. మహేష్ జీ తెలుగులో ప్రసారం కానున్న డాన్స్ ఇండియా డాన్స్ షోకు గెస్ట్ గా వచ్చారు వీళ్లిద్దరూ రావడంతోనే ఒక క్రేజీ డాన్స్ స్టెప్ తో అలరించారు.. అంతేకాదు డాన్స్ ఇండియా డాన్స్ షోలో పార్టిసిపెంట్స్ కు మంచిగా మార్కులు వేయడంతో పాటు బాగా ప్రశంసించారు కూడా.. అయితే భూమిక అనే పార్టిసిపెంట్ ఓ హాట్ సాంగ్ స్టెప్స్ వేయగా.. మహేష్ కూడా మెస్మరైజ్ అయ్యారు..

భూమిక అనే పార్టిసిపెంట్ మహేష్ బాబు ని చూస్తూ.. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని మీరు అంటే నాకు చాలా ఇష్టం అని.. మిమ్మల్ని డైరెక్ట్ గా చూడడం నిజంగా నా కల అని మహేష్ బాబుని మాటల తుటాలతో మాయ చేస్తుంది.. ఒక్కసారి మిమ్మల్ని టచ్ చేయొచ్చా అని మహేష్ బాబుని అడుగుతుంది.. తప్పకుండా అని మహేష్ బాబు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు.. భూమికకు బోనస్ గా ఓ హగ్గును కూడా ఇస్తాడు మహేష్.. అంతే ఇక అమ్మాయి ఫుల్ ఫిదా..భూమిక మహేష్ ను హగ్ చేసుకున్నా ఆనందంలో ఉంటే.. సితార మరో స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుంది ..

Mahesh Babu sitara dance india dance show program
Mahesh Babu sitara dance india dance show program

డాడీ తోనే హగ్గా.. మరి నా హగ్ ఎక్కడా అని సితార ప్రశ్నిస్తుంది.. తను షాక్ అవుతూ పరిగెత్తుకుంటూ సితార దగ్గరకు వెళుతుంది.. సితార కూడా భూమికను హగ్ చేసుకుంటుంది.. భూమిక పర్ఫామెన్స్ నిజంగా చాలా బాగుందని మహేష్ ప్రశంసిస్తాడు.. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ అని సితార మార్కులు వేస్తుంది.. మొత్తానికి తండ్రి కూతుర్లు ఇద్దరు డాన్స్ ఇండియా డాన్స్ లో ఇంకా ఏం మాట్లాడారు తెలియాలి అంటే.. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న షో కోసం ఎదురు చూడక తప్పదు.. మహేష్ అంత సామాన్యంగా ఎవ్వరికీ హగ్ ఇవ్వడు అలాంటిది.. తనకు హగ్ ఇచ్చాడని తెలిసి నమ్రత కాస్త కోపంగా ఉన్నారని తెలుస్తోంది..

Advertisement