Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విడుదలైన మొదటి రోజు నుంచి రోజుకు ఒక ట్రెండ్ ను సెట్ చేస్తుంది.. పాత రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.. ఒక సినిమా కలెక్షన్స్ ను మరొక సినిమా కలెక్షన్స్ తో పోవడం సహజమే.. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట రెండో రోజు కలెక్షన్స్ తో టాప్ సెవెన్ కి చేరుకుంది..!
టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో సర్కారు వారి పాట ఏడవ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది.. రెండవ రోజు కోట్ల షేర్ తో మిశ్రమ టాక్ నడుస్తున్నా కూడా టాప్ సెవెన్ ప్లస్ లో నిలిచి వావ్ అనిపించుకుంది.. ఒక్కసారి టాలీవుడ్ లో రెండు రోజుల అత్యధిక కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న టాప్ 10 చిత్రాల లిస్ట్ ఒక్కసారి గమనిస్తే.. ఆర్ఆర్ఆర్ -31.36 కోట్లు, బాహుబలి2 -14.80 కోట్లు, పుష్ప -13.70 కోట్లు, కేజిఎఫ్2 -13.37 కోట్లు, భీమ్ల నాయక్ -13.14 కోట్లు,

రాథే శ్యామ్ -12.32 కోట్లు, సర్కారు వారి పాట -11.04 కోట్లు, వకీల్ సాబ్ -10.74 కోట్లు, సాహో-10.55 కోట్లు, అల వైకుంఠపురం-10.25 కోట్లు.రెండో రోజు కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో సర్కారు వారి పాట ఏడవ స్థానంలో నిలిచింది. బాక్స్ ఆఫీసు వద్ద సెన్సేషన్ కలెక్షన్స్ వసూలు చేసింది వర్కింగ్ డే అయినా కూడా.. రెండున్నర సంవత్సరాల తరువాత మహేష్ బాబు సినిమా రావడంతో ప్రేక్షకులు సర్కారు వారి పాట కు క్యు కడుతున్నారు. ఇక వీకెండ్ ఎండ్ అయ్యే సరికి ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.