Saturday, July 2, 2022

Mahesh: మహేష్ నాకు మా ఆవిడకి గొడవపెట్టాలని అనుకుంటున్నారా అంటూ ఫైర్.!?

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా విడుదలైన నా మొదటి షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. మహేష్ బాబు స్టైలిష్ లుక్ తో తన నటనతో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించాడు.. కీర్తి సురేష్ తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇటీవల కర్నూల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ చిత్ర యూనిట్.. తాజాగా సర్కారు వారి టీమ్ వైజాగ్ లో మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది..!

Mahesh Babu Sarkaru Vaari Paata Suceess Meet in Vizag
Mahesh Babu Sarkaru Vaari Paata Suceess Meet in Vizag

ఈ కార్యక్రమంలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ పరుశురామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్, కీర్తి, పరుశురామ్ సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా ఒక మహిళ అభిమాని మాట్లాడుతూ.. ఒక సీన్ లో కీర్తి సురేష్ నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు చాలా ఎగ్జైట్ అవుతారు కదా.. అలా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఎగ్జైట్ అయ్యారా..!? అని మహేష్ బాబును అడుగుగా.. మా ఆవిడ కి నాకు గొడవ పెట్టాలి అని అనుకుంటున్నారా..!? అంటూ మహేష్ బాబు నవ్వుతారు..

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కీర్తి సురేష్ నన్ను తిట్టాలి. కానీ రెండు మూడు టికెట్లు తీసుకుని ఆ సీన్ కోసం. అప్పుడే పరుశురాం వచ్చి నా ముఖం చూస్తూ తిట్టామని చెప్పారు. దాంతో కీర్తి మీ ముఖం చూస్తూ తిట్టడం నావల్ల కాదు సార్.. మీ ఫ్యాన్స్ ఊరుకోరు.. నన్ను తిడతారు నేను చెయ్యను అని చెప్పింది కీర్తి.. వాళ్ళు ఏమీ అనరు అని ధైర్యం చెప్పాను అని మహేష్ చెబుతాడు.. ఇక వెంటనే కీర్తి సురేష్ మాట్లాడుతూ నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ సమయంలో నాకు గుండె ఆగిపోయింది. ఆ సీన్ గురించి మాట్లాడితే నాకు ఇప్పటికీ భయంగానే ఉంది అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు