సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.. ఇక రెండో రోజు శుక్రవారం పైగా వర్కింగ్ డే అయినప్పటికీ మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది..! ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆన్లైన్లో టికెట్లు అన్నీ ఫుల్ గా బుక్ అయ్యాయి.. పైగా వీకెండ్ కావడంతో పలు చోట్ల నేటి ఉదయం నుంచే హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి..! సర్కారు వారి పాట సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..!?
రెండవ రోజు శుక్రవారం అవడంతో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం చక్కటి కలెక్షన్లను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ నమోదయ్యాయి. సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా 16 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయగా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లు కలెక్షన్ ను సొంతం చేసుకుంది.

మొత్తంగా రెండవ రోజు 86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సర్కారు వారి పాట రెండో రోజు కూడా దుమ్ముదులిపేసింది. ఇక రెండవ శనివారం ఆదివారం కావడంతో కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. సర్కారు వారి పాట చిత్రానికి అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ కూడా పోటెత్తుతున్నారు.. వీకెండ్ కావడంతో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి ఉదయం షో నుంచే.. ఇక ఈ రెండు రోజులు కలెక్షన్స్ తో బయ్యర్స్ లాభాల బాట పట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు..