సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కార్ వారి పాట.. గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలై రెండవ రోజు కూడా ఊరమాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.. నిన్న వర్కింగ్ డే అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.. నైజాం ఏరియాలో ఉదయం కాస్త చప్పచప్పగా ఉన్నా సాయంత్రంనికి మాత్రం పుంజుకుంది..!! మొదటి రోజే సర్కారు వారి పాట నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టింది..!సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో రాజమౌళితో చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
రాజమౌళితో చేయబోయే సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇక మహేష్ బాబు రాజమౌళి తో చేసే సినిమా తన కెరీర్లో 25వ చిత్రంగా నిలవనుంది.. ఈ సినిమా కాస్త సమయం తీసుకున్నా కానీ లేటెస్ట్ గా రానుందని మహేష్ బాబు అన్నారు. రాజమౌళి కూడా తన సినిమా తీయడానికి కాస్త సమయం తీసుకున్న కచ్చితంగా బాగా హిట్ బొమ్మ పడాల్సిందే అన్నట్టుగా ఆ చిత్రాన్ని నిర్మిస్తారు..దర్శకధీరుడు రాజమౌళి కూడా మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాను చూశారని.. మహేష్ బాబు కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారని.. రాజమౌళి మహేష్ బాబు నీకు దండం పెట్టారని టాక్ వినిపిస్తోంది..

ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్, లుక్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసిన తర్వాత.. తన దర్శకత్వంలో రానున్న సినిమాల్లో మహేష్ బాబును ఏ విధంగా మేక్ ఓవర్ చేయాలి.. అనే విషయంలో జాగ్రత్తలు తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. సర్కారు వారి పాట మొదటి రోజే నాన్ RRR రికార్డ్స్ బ్రేక్ చేసి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా యాక్షన్ అండ్ అడ్వెంచర్ గా తెరకెక్కనుందని రాజమౌళి ముందుగానే హింట్ ఇచ్చారు..