Mahesh Babu : 50 రోజులు పూర్తి చేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట పోస్టర్స్ వైరల్..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట..! సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు మహేష్ ఈ సినిమాతో.. మహేష్ బాబు సినిమాల అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి.. ఎన్నో అంచనాల మధ్య మే 12న ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ సాలిడ్ టాక్ ను సొంతం చేసుకుంది.. నేటితో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అంటూ కొన్ని పోస్టర్స్ ను విడుదల చేశారు..! ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..! సర్కారు వారి పాట సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది ఈ చిత్రం లో కలిపి 110.12 కోట్లను వసూలు చేసింది.. 10.88 కోట్ల దూరంలో బ్రేక్ ఈవెన్ దగ్గర ఆగిపోయింది ఈ సినిమా అన్ని ఏరియాలలో 91 శాతం రికవరీ పూర్తిచేసుకుని నిలిచింది.. రెండు తెలుగు రాష్ట్రాలలో రాకపోయినప్పటికీ అమెరికాలో మాత్రం మహేష్ బ్రేక్ ఈవెన్ సాధించాడు..

అమెరికాలో మహేష్ దుమ్ము దులిపే కలెక్షన్లను వసూలు చేశారు.. అమెరికాలో మహేష్ వన్ మిలియన్ వసూలు చేసిన చిత్రాలలో సర్కారు వారి పాట 11వ చిత్రం గా నిలిచింది.. 2M మిలియన్ డాలర్లను వసూలు చేసిన చిత్రాలలో నాలుగవ చిత్రంగా నిలిచింది.. మొత్తంగా 2.4 మిలియన్ మార్క్స్ ను వసూలు చేసింది సర్కారు వారి పాట.. అమెరికాలో ఈ ఘనత సాధించిన రెండవ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ చిత్రంతో మహేష్ బాబుకి అమెరికాలో ఉన్న క్రేజీ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సర్కారు వారి పాట సినిమాకి అటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఇటు మాస్ ఆడియన్స్ కూడా బీభత్సంగా వచ్చారు.. ఈ సినిమాకి మొదటి రెండు వారాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.. మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికే బ్రహ్మరథం పట్టారు.. మహేష్ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రప్పించేలా చేసే సత్తా ఉందని నిరూపించారు..

Mahesh Babu Sarkaru Vaari Paata Movie completed 50 days
Mahesh Babu Sarkaru Vaari Paata Movie completed 50 days

ఇటీవల ఈ సినిమా అమెజాన్ రెంటల్ బేస్ లో విడుదల చేశారు.. 199 పెట్టీ ఈ సినిమాను ఓ రెండు వారాల పాటు రెంటల్ బేస్ లో ఉంచారు. ప్రస్తుతం ఈ సినిమా మా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా చూడొచ్చు.. సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత మేకర్స్ మురారివా అనే స్పెషల్ సాంగ్ ధియేటర్ వర్షన్ కి యాడ్ చేశారు.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది.. ఇందులో కీర్తి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సనామా కథ విషయానికి వస్తే భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు.

పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అబౌవ్ యావరేజ్ గా నిలిచింది. మే నెలలో విడుదలైన సినిమాలలో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట సినిమా రికార్డులకు ఎక్కింది.. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కళావతి పాట ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏకంగా 200 మిలియన్ న్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ లో షేక్ చేస్తోంది.. అత్యధిక న్యూస్ ని సొంతం చేసుకున్న పాటలలో కళావతి సాంగ్ ముందుంది.. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు వీక్షకులను అలరించాయి.. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రస్తుతం తన కుటుంబం తో కలిసి ఫారన్ వెకేషన్ లో ఉన్నారు. ఫారన్ వెకేషన్ ముగియగానే మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నారు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తారు..