Sunday, May 22, 2022

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమాపై వైసీపీ బ్రాండ్.. బ్యానర్లపై జగన్, వంగవీటి రాధా ఫోటోలు..!

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట.. నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ లో మహేష్ బాబు ఉ నేను ఉన్నాను నేను విన్నాను డైలాగ్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తే.. మరోవైపు సర్కారు వారి పాట సినిమా బ్యానర్లపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వంగవీటి రాధా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!మే 12న సర్కారు వారి పాట థియేటర్స్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు సర్కార్ వారి పాట బ్యానర్స్ అన్ని ఏరియాల్లో తారసపడుతూనే ఉన్నాయి..

కాకపోతే ఈ చిత్రాన్ని అధికారిక వైయస్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తమ సొంత సినిమాగా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా మహేష్ బాబు, వైయస్ జగన్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ సైతం ఏర్పాటు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పలు చోట్ల మహేష్ అభిమానులు సర్కారు వారి పాట బ్యానర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించాయి.వైయస్ జగన్ ఫోటోలతో పాటు దివంగత కాపు నేత వంగవీటి రంగ ఫోటోలు సైతం కనిపించాయి. విజయవాడ మెయిన్ సెంటర్స్ లో మహేష్ బాబు వంగవీటి రంగ కు చెందిన నిలువెత్తు ఫోటోలను ముద్రించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యేకించి విజయవాడలో పెద్ద ఎత్తున కట్టారు.

Mahesh Babu Sarkaru Vaari Paata movie banners on Jagan vangaviti Radha images viral
Mahesh Babu Sarkaru Vaari Paata movie banners on Jagan vangaviti Radha images viral

విజయవాడ సెంట్రల్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఫోటోలను ముద్రించిన బ్యానర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సర్కారు వారి పాటలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫేమస్ డైలాగ్ ను మహేష్ చెప్పడంతో సినిమా పై వైఎస్ఆర్సిపి అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. మే 12న సర్కార్ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు