Mahesh Babu : ఏ మాయ చేశావే చిత్రాన్ని మ‌హేష్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుక‌లా?

Mahesh Babu: వెండితెర‌పై ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ఈ చిత్రానికి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ మూవీతోనే నాగ చైతన్య మొదటి విజయం ద‌క్కించుకోగా, సమంత ఈ చిత్రంతోనే డెబ్యూ ఇచ్చింది. చైతు సమంతల మనసులను ఒకటి చేసిన ఆ సినిమాకు రెహమాన్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్. ఇప్ప‌టికీ ఈ సిన‌మాలోని పాటలు ఎంతో విన‌సొంపుగా అనిపిస్తాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా గౌత‌మ్ మీన‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఏ మాయ చేశావే సినిమాను చైతన్య కోసం రాసుకోలేదట దర్శకుడు గౌతమ్ మీనన్. తాజాగా త‌న‌ సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. నేను ఈ ఏ మాయ చేశావే సినిమాను మహేష్ బాబు కోసమే రాసాను. కానీ నేను ఈ సినిమా కథతో ఆయన వద్దకు వెళ్లే సమయానికి మహేష్ బాబు పోకిరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దాంతో ఆయ‌న ఇలాంటి స్టోరీతో సినిమా చేసేందుకు సిద్ధంగా లేదు. మంచి మాస్, యాక్ష‌న్ సినిమా చేద్దాం అని చెప్పి ఏ మాయ చేశావే కు నో చెప్పారు అని పేర్కొన్నారు. అయితే ఈ ఏ మాయ చేశావే సినిమా మంచి లవ్ స్టోరీ అనేది అందరికి తెలిసిందే. తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా కొన్నాళ్ళకు హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. తమిళ్ లో శింబు – త్రిషా జంటగా నటించగా హిందీలో ప్రతీక్ – అమీ జాక్సన్ జంటగా నటించారు.

Mahesh Babu rejects naga chaitanya hit movie
Mahesh Babu rejects naga chaitanya hit movie

Mahesh Babu : మ‌హేష్ స్థానంలో చైతూ..

అయితే ఇప్పుడు డైరెక్టర్ గౌతమ్ మీనన్ సరికొత్త తరహాలో సీక్వెల్ ని రెడీ చేశాడట. తమిళ్ లో మాత్రం ఒక జంటను కూడా రెడీ చేసినట్లు టాక్ వస్తోంది. ఈ సారి శింబు సరసన త్రిష కాకుండా అనుష్క ను అనుకుంటున్నట్లు సమాచారం.మ‌రి తెలుగులో స‌మంత‌- నాగ చైత‌న్య‌తోనే సీక్వెల్ చేస్తాడా లేకుంటే వేరే జంట‌ని ఎంపిక చేసుకుంటాడా అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా, సిద్ది ఇదాని హీరోయిన్ గా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమాని తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 17న రిలీజ్ అయింది.. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు.

mahesh babu rejects ye maya chesave movie

Advertisement