Mahesh Babu : మహేష్ రాజమౌళి సినిమా నెక్స్ట్ లెవెల్ అప్డేట్..

Mahesh Babu :  ఆర్ ఆర్ సినిమాతో దర్శకతీరుడు రాజమౌళి రేంజ్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పటికే రాజమౌళి తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు హాలీవుడ్ లో ఏదైనా సినిమా తీయాలని అనుకుంటే తప్పకుండా నన్ను కలవమని ముందుగానే కర్చీఫ్ కూడా వేశాడు జేమ్స్ కెమెరూన్.. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చిన తరువాత రాజమౌళితో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు యాక్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు.. ఇక రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే..

Mahesh Babu rajamouli movie next level update
Mahesh Babu rajamouli movie next level update

మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాని చేయనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేయగా ఆగస్టులో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళనుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రానున్న సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటని పరిచయం చేసిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కావాల్సిన తారాగణం గురించి రాజమౌళి హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్టుల ఏజెన్సీ తో ఒప్పందం చేసుకునే సంగతి తెలిసిందే.

ఆస్కార్ వచ్చిన తరువాత రాజమౌళి ఆలోచన తీరు మారిపోయిందట. పాన్ వరల్డ్ గా మహేష్ సినిమాని తీర్చిదిద్దాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాగా రూపొందించాలని అనుకుంటున్నారట రాజమౌళి. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ హాలీవుడ్ టీం తో మాట్లాడిన రాజమౌళి సి జి వర్క్స్ కోసం కూడా అక్కడి టీం తోనే మంతనాలు జరుపుతున్నారట. మహేష్ తో చేయబోయే సినిమా కూడా ఆస్కార్ బరిలో దింపేందుకు రాజమౌళి ఇప్పటి నుంచే ఫ్రీ ప్లాన్ వర్క్స్ చేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ తో పాటు ఆస్కార్ ప్రమోషన్స్ బడ్జెట్ ని కూడా కలిపేసాడట. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మరో హాలీవుడ్ హీరోయిన్ తీసుకుంటారని బలంగా ఓ న్యూస్ వినిపిస్తోంది..