Mahesh Babu : ఒకే ఒక్క ఫోటో హాలీవుడ్ ని శాసించడానికి సంకేతంలా..మహేష్ బాబు, రాజమౌళి మూవీ జారీ చేసేలా ఉంది. మహేష్ బాబు రాజమౌళి ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా టాలీవుడ్ లో హాలీవుడ్ మూవీ అని వార్తలు వస్తున్నాయి అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు.
అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందని యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.
జస్ట్ గ్లోట్ ఫ్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అన్నందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మహేష్ సినిమాతో పది పదిహేను ఆస్కార్ లు కొట్టే రేంజ్ లో ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో సెన్సేషనల్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అదే రాజమౌళి ,మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటో.. ఇద్దరు ఎదురుగా నిలబడి నెక్స్ట్ హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఏలేద్దామని చర్చించుకుంటున్నట్టు ఈ ఫోటో ఉంది. ఆ ఫోటోలో మహేష్ బాబు ఏదో చెప్తుంటే రాజమౌళి ఆసక్తిగా వింటున్నారు.
అయితే ఆసక్తిగా ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు.ఇది ఎప్పటి ఫోటో? ఎక్కడ కలిశారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు అంతు పట్టకుండా పోయింది. అయితే రీసెంట్ గానే ఇద్దరు కలిసి ఉన్నారని కొంతమంది అంటుంటే ఓల్డ్ ఫోటో అని ఇంకొంతమంది అంటున్నారు. కానీ ఈ ఫోటో మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. దానిని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా మా వాడితో నెక్స్ట్ మామూలుగా ఉండదని ఆ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఏంటి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం.