Mahesh Babu : మహేష్ బాబు నాగార్జున ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్టీఆర్ కారణమా.!? ఎలాగంటే.!?

Mahesh Babu : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వారసులు రావటం అనేది ఇప్పుడు సాధారణమైన విషయమే.. కానీ ఒకప్పుడు మాత్రం చాలా విమర్శలు వచ్చాయి.. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇలా సినీరంగానికి పనిచేసిన చాలా మంది వారి వారసులను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు వారితో పాటు వారి బంధువుల పిల్లలు, వారికి తెలిసిన వారికి సినిమాలపై ఆసక్తి ఉన్నవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఇప్పుడంటే వారసులు వస్తున్నారు.. కానీ ఒకప్పుడు ఈ విధానం ఇది లేదు.. అయితే టాలీవుడ్ లోకి వారసులు రావడం పరిచయం చేసింది మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పాలి..! నాగార్జున, మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఓ విధంగా నందమూరి తారక రామారావే కారణమట.. అదెలాగంటే.!? తెలుగు సినిమా మా గురించి మాట్లాడాలంటే ముందుగా ఎస్.వి.రంగారావు గురించి మాట్లాడాలి.. ఆయన సినిమాలలో అద్భుతంగా రాణించారు..

కానీ తన వారసులని మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.. ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు వీళ్లంతా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. తెలుగు ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేయడం మొదలుపెట్టింది ఎన్టీఆరే.. ఎన్టీఆర్ ముందుగా తన పెద్ద కొడుకు హరికృష్ణ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ అని కూడా పరిచయం చేశారు. అలాగా మరో ఇద్దరు కొడుకులను నిర్మాణ రంగంలోకి దింపారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.. సినిమా రంగంలోకి వారసులని పరిచయం చేయటం తో ఎన్నో రకాల ఇబ్బందులను కూడ పడ్డారు.. సాధారణంగా ఎన్టీఆర్ మొండివాడు అని అంటుంటారు.. తను అనుకున్నది చేయాలి అని అనుకుంటారు.. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆ విమర్శలను పట్టించుకోకుండా టాలెంట్ ఉన్నవాళ్లు ఈ రంగంలో నిలబడతారని లేదంటే లేదు అని ఎన్టీఆర్ ధైర్యంగా ముందుకు అడుగు వేశారు..

Mahesh Babu nagarjuna to entry on Tollywood Because of NTR
Mahesh Babu nagarjuna to entry on Tollywood Because of NTR

అలా చేయడం వలన ఎంతో మందికి భవిష్యత్తును అందించారు.. ఎన్టీఆర్ తన కొడుకులను ఇండస్ట్రీలోకి పరిచయం చేయడంతో నాగేశ్వరరావు, కృష్ణ వారి వారసులను కూడా పరిచయం చేస్తారు.. ఏఎన్ఆర్ తనయుడు నాగార్జున అప్పటికే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపారంగంలో స్థిరపడాలి అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ తన వారసులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావడంతో ఏఎన్ఆర్ కూడా నాగార్జునను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. నాగార్జున ఇప్పుడు మన్మధుడు గా పెద్ద స్టార్ గా వెలుగొందుతున్నాడు.. నాగార్జున తన వారసులుగా నాగచైతన్య, అఖిలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు.. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నలుగురు కలిసి మనం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే..

సూపర్ స్టార్ కృష్ణ కూడా అదే బాటలో రమేష్ బాబు హీరోగా తీసుకువచ్చారు. కానీ రమేష్ బాబు హీరోగా నిలదొక్కుకోలేక పోయడు. కృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో రమేష్ బాబు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా పలు సినిమాలు తీశారు అవి కూడా పెద్ద హిట్ అందించలేదు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ తన రెండవ కొడుకు మహేష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు.. రాజకుమారుడు నుండి సర్కారు వారి పాట వరకు మహేష్ ఎన్నో హిట్ లను అందుకున్నారు.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.. ఇలా ఇండస్ట్రీకి మీరంతా పరిచయం అవ్వడానికి ఎన్టీఆర్ కారణమనే చెప్పాలి..