Namratha : ఆ పేరు విషయంలో నమ్రతదే పై చేయి.. మహేష్ వెనక్కి తగ్గాడా.!?

Namratha :  సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వరుసగా విషాద వార్తలు వచ్చిన ఇన్ని రోజులకి వరుస గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి.. త్వరలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాలు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. మహేష్ బాబు జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండు రెస్టారెంట్లు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.. మహేష్ వ్యాపార సంస్థ ప్రారంభమయ్యే సమయం వచ్చేసింది.. నేడు ఏషియన్ గ్రూప్ అధినేత ఏషియన్స్ సునీల్ మహేష్ బాబు సంయుక్తంగా ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారు..

Advertisement
Mahesh Babu Minerva coffee shop name on namratha upper hand
Mahesh Babu Minerva coffee shop name on namratha upper hand

ఏషియన్ సునీల్ అలాగే నమ్రత పేరు మీద ఏషియన్ నమ్రత పేరుతో ఒక హోటల్స్ చైన్ ప్రారంభిస్తున్నారు. ఈ హోటల్ కి మినర్వా కాఫీ షాప్ అనే పేరు పెట్టారు. అయితే ఈ కాఫీ షాప్ కి ముందు నుంచి నమ్రత పేరు పెట్టాలని మహేష్ బాబు అనుకున్నారట. కానీ నమ్రత కు బిజినెస్ లావాదేవీలు తన పేరు మీద జరిగినా ఇష్టమే. కానీ బిజినెస్ జరిగే వాటికి తన పేరు పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదని ముందే చెప్పిందట. మహేష్ కేమో నమ్రత పేరు పెట్టాలని గట్టిగా అనుకున్నారట. ఇక నమ్రత కాదు అనేసరికి మినర్వా కాఫీ షాప్ అనే పేరు పెట్టారు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం మహేష్ మీద నమ్మకదే పై చేయి అని తెలుస్తోంది.

Advertisement

అయితే మహేష్ ఏషియన్ సునీల్ ఇద్దరూ కలిసి రెండు రెస్టారెంట్లను ఓపెన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒకటి మాత్రమే ఈరోజు ప్రారంభించబోతున్నారు. అంటే ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఆ రెస్టారెంట్ కి నమ్రత పేరు పెడతారేమోనని సన్నిహిత వర్గాలను సమాచారం. కానీ అందుకు కూడా నమ్రత ఒప్పుకోవడం లేదని ఇన్సైడ్ టాక్. ఇక ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి . టిఆర్ఎస్ ఆఫీస్ బంజారా హిల్స్ దగ్గరలో ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏంబిమాల్ నడుపుతున్నారు. ఇద్దరు కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంలో మహేష్ బాబు తన అన్నయ్య , అమ్మ నాన్నను కోల్పోయిన తర్వాత ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆయన అభిమానులకి..

Advertisement