Mahesh Babu : మహేష్ బాబు బిల్ గేట్స్ వరకు వెళ్లడానికి కారణం ఇదే..!?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫారిన్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. యూరప్ ట్రిప్ లో ఉన్న మహేష్ తన కుటుంబం తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ను తన అభిమానులతో పంచుకుంటున్నారు సితారతో కలిసి రోడ్డు ట్రిప్ ఫ్యామిలీతో కలిసి లంచ్ ఇటలీ వెళ్తున్న విషయం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చారు.. ఇక అమెరికా లో లాండ్ అవ్వగానే తన ఫ్రెండ్ ఈ ఫోటో తీశాడు అంటూ మహేష్ BTS వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.. తాజాగా మహేష్ తన భార్య నమ్రత కలిసి ప్రపంచ కుబేరుడు సాప్ట్ వేర్ దిగ్గజ బిల్ గేట్స్ ను కలిశారు.. మహేష్ బిల్ గేట్స్ ను కలిసినట్టు ఓ ఫోటో షేర్ చేస్తూ అందమైన కోట్ రాశారు..

ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బిల్ గేట్స్ పై కాకుండా వీళ్లిద్దరు ఎందుకు కలిశారు అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.. ఇంతకీ ఎందుకు కలిశారు.. బిల్ గేట్స్ ను కలవడం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..!సూపర్ స్టార్ మహేష్ బాబు బిల్ గేట్స్ తో కలిసి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రపంచం చూసిన అతికొద్ది మంది దర్శనీకుల్లో ఒకరు.. ఆయన చాలా సింపుల్ గా ఉంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్.. అయినటువంటి బిల్ గేట్స్ ను కలిశానని మహేష్ పేర్కొన్నారు.. మహేష్ బిల్ గేట్స్ ని ఎందుకు కలిశారు.. యాదృచ్ఛికంగా కలిశారా.. లేక ఏదైనా వ్యాపార రీత్యా కలిసారా అని చర్చ కూడా మొదలైంది సోషల్ మీడియాలో.. ఎందుకంటే మహేష్ బాబు ఒకపక్క సినీ నటుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు..

Mahesh Babu meets Bill Gates because
Mahesh Babu meets Bill Gates because

యాడ్స్ చేస్తూనే.. పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తున్నారు.. మహేష్ బిల్ గేట్స్ ను కలవడం వెనుక ఏదైనా వ్యాపార కారణాలు ఉన్నాయా అని హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.. ఈ ప్రశ్నలకు ఒక వైపు నుంచి ఆలోచిస్తే అవును అనే సమాధానం వస్తుంది ఎందుకంటే మహేష్ ఇటీవల అమెరికాలో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి.. ఏదో పెద్ద మొత్తంలోనే ఆస్తి కొనుగోలు చేస్తున్నారంటూ.. అదికూడా నమ్రత కోసమే కొంటున్నారని.. మొత్తానికి అమెరికా లో మహేష్ బాబు ఇన్వెస్ట్ చేయడం పక్క అంటూ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మహేష్ తన భార్య నమ్రత కలిసి బిల్ గేట్స్ ని కలవడం వెనుక కచ్చితంగా ఏదో వ్యాపారం కోసం అయి ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. సాధారణంగా ఎవరు ఒకరిని ఊరికినే కలవరు..

కచ్చితంగా వారిని వెళ్లి కలిశారు అంటే ఏదో పనిమీద అయి ఉంటుందని అందరికీ తెలిసిందే.. మహేష్ కూడా ఖచ్చితంగా బిల్ గేట్స్ వెళ్లి కలిశారు అంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.. మహేష్ బాబు అమెరికా ట్రిప్ ముగిగానే ఇక ఇండియా వచ్చేస్తారు.. మహేష్ ఇండియా రాగానే త్రివిక్రమ్ తో కలిసి చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి.. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుంది అంటే అటు సినీ ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. జూలై చివరి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది..