Sunday, May 22, 2022

Mahesh Babu : మహేష్ బాబు లాస్ట్ 4 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇటీవల కాలంలో మహేష్ బాబు తనకు నప్పే కథలను ఎంచుకుని సరికొత్త కథనంతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు..! ఫన్ తో నవ్వులు పూయిస్తు.. యాక్షన్ తో మాస్ జాతర.. కన్నీటిని తెప్పించే డైలాగ్స్ తో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు మహేష్… సూపర్ స్టార్స్ లాస్ట్ 4 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఓ లుక్కేయండి..!

సర్కారు వారి పాట -45.21 కోట్లు, సరిలేరు నీకెవ్వరు -43.16 కోట్లు, భరత్ అనే నేను-35.20 కోట్లు, మహర్షి -32.2 కోట్లు. గత నాలుగు సినిమాలు చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు సినిమా టాప్ లిస్ట్ లో నిలిచింది.. సరిలేరు నీకెవ్వరు రికార్డ్స్ ను తాజాగా విడుదలైన సర్కారు వారి పాట బ్రేక్ చేసింది.. మిగితా అన్ని సినిమాలతో పోల్చుకుంటే సర్కారు వారి పాట ట్రెండ్ సెట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్ తో.. ఇక గత నాలుగు చిత్రాల గ్రాస్ విషయానికి వస్తే.. సర్కారు వారి పాట -70 కోట్లు, సరిలేరు నీకెవ్వరు -67 కోట్లు, భరత్ అనే నేను-55 కోట్లు, మహర్షి -48.2 కోట్లు.. ఇక గ్రాస్ లో కూడా సర్కారు వారి పాట ముందుంది..

Mahesh Babu last 4 movies 1St day collections
Mahesh Babu last 4 movies 1St day collections

గ్రాస్ పరంగా కూడా మహేష్ కెరీర్ లో సర్కారు వారి పాట సంచలన కలక్షన్స్ తో కెరీర్లో బెస్ట్ రికార్డుల్ని తిరగరాసింది..మరోవైపు మొదటిరోజే అమెరికాలో వన్ మిలియన్ మాక్స్ ను సొంతం చేసుకొని సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఇక ఈ వీకెండ్ లో సర్కారు వారి పాట మూడంకెల గ్రాస్ ను సొంతం చేసుకుంటుందని అర్థమౌతుంది.. మహేష్ నుంచి రెండున్నర సంవత్సరాల తర్వాత సినిమా రావడంతో ప్రేక్షకులు సర్కారు వారి పాట చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు