Mahesh Babu : ఎన్ని పనులు ఉన్నా మానుకుని .. బావమరిది కోసం స్పెషల్ షో కి వెళ్ళబోతున్న మహేష్ బాబు..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినీ ఇండస్ట్రీలో ఈయనకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంతోమంది కలల రాకుమారుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఏదైనా ఒక బ్రాండ్ గురించి ప్రమోట్ చేస్తున్నారు అంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందని గుర్తింపు కూడా ఉంది.. ఇక మరి సినిమా ఈవెంట్ కైతే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మహేష్ బాబు అభిమానులే ఆ సినిమాను సక్సెస్ చేస్తారనటంలో సందేహం లేదు. సాధారణంగా ఎవరైనా కొత్త హీరోలు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి మహేష్ బాబును పిలుస్తూ ఉంటారు.

అలాంటి ఫంక్షన్లకు ఆయన హాజరవుతున్నారు అంటే ఇక స్వయానా బావ గారు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇక మహేష్ బాబు రాకుండా ఉంటారా..? ఎన్ని పనులు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ ఆయన హాజరవుతారు. ఈ క్రమంలోని తన బావ సుదీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈరోజు విడుదలైంది.. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా మహేష్ బాబు రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ ట్రైలర్ పై మహేష్ బాబు ఆసక్తి చూపించడంతో ఈ సినిమాపై అభిమానులకు కూడా మరింత హైప్ క్రియేట్ అయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల అయి మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకుంది.

Mahesh Babu is going to a special show for his brother-in-law
Mahesh Babu is going to a special show for his brother-in-law

ఇకపోతే ఈరోజు మహేష్ బాబు ఈ సినిమా స్పెషల్ షో కి హాజరు కాబోతున్నారు అనే వార్త వైరల్ గా మారింది. ఇక సినిమా అనంతరం సినిమా ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లో వినడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. ఇక ఆమె కెరియర్ లోనే ఇదొక బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు . ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయింది .త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తవుగానే రాజమౌళి పాన్ ఇండియా సినిమా మొదలవబోతోంది.

Advertisement