‘ఢీ’ ఫేమ్ చైతన్య మాస్టర్ కుటుంబానికి భారీ సహాయం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు?

ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ గురించి కొద్ది రోజుల క్రితం వరకు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు గానీ, అతని ఆత్మహత్యతో యావత్ టెలివిజన్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వున్న డాన్సర్లందరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత ఏప్రిల్ 30వ తేదీనాడు నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో సూసైడ్ చేసుకున్నారు చైతన్య మాస్టర్. శనివారం నాడు నెల్లూరులోని కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చైతన్య తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ, హఠాత్తుగా సూసైడ్ చేసుకున్నాడు.

చనిపోయే ముందు చైతన్య తనకు చాలా అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడం తనవలన కాదని, ఢీ షోలో డబ్బులు బాగా తక్కువ ఇస్తున్నారని వాపోతూ తన సన్నిహితులకు క్షమించమని వేడుకుంటూ చనిపోవడం అందరినీ కన్నీరు కారేలా చేసింది. చైతన్య స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి మండలం దగ్గర్లోని మట్టువారి పాలెం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన చైతన్య డాన్స్‌పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఢీ షో ద్వారా పాపులర్ అయ్యారు. గత సీజన్‌లో ఢీ టైటిల్‌ కొద్దిలో మిస్ కావడం గమనార్హం.

చైతన్య సెల్ఫీ వీడియో చెప్పిన దాన్ని బట్టి.. ఆర్ధిక ఇబ్బందులే చైతన్య మాస్టర్ ఆత్మహత్యకి కారణం అని పోలీసులు నిర్ధారణకు రావడం అందరికీ తెలిసిందే. ఇకపోతే చైతన్య కుటుంబ ఆర్ధిక పరిస్థితిని గమనించిన కొందరు సినీ ప్రముఖులు పెద్దమొత్తంలో సాయం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మొదటగా మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు అతని డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని చాలా ఎంజాయ్ చేసేవాడట. అలా అతను ఆత్మహత్య చేసుకొని అని తెలియడంతో ఆయన చాలా దిగ్బ్రాంతికి గురై వెంటనే చైతన్య అమ్మగారి ఫోన్ నెంబర్ కనుక్కొని, ఫోన్ లోనే పరామర్శించాడట. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ తరుపున సుమారుగా 10 లక్షల రూపాయలకు పైగా ఆర్హిక సహాయం చేసినట్టు భోగట్టా.

ఇక ఈ వరుసలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరినట్టు తెలుస్తోంది. చైతన్య విషయం మొత్తం తెలుసుకున్న మహేష్ తీవ్ర మానస్థాపానికి గురై, ఇలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో ఇంకెవ్వరికీ రాకూడదని తలచి తన మేనేజర్ ద్వారా అధికమొత్తంలో డబ్బులు చైతన్య మాస్టర్ ఇంటికి పంపినట్టు తెలుస్తోంది. అదే విధంగా తెలుగు సినిమా ప్రముఖులు కొందరు స్పందించి వారికి తగిన సాయం చేస్తామని చెప్పినట్టు సమాచారం.