Mahesh Babu : ఫైనల్ గా తన విగ్గు గురించి స్పందించిన మహేష్ బాబు .. ఒకే ఒక్క మాట అన్నాడు !

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా అనేంత అందంగా కనిపిస్తారు. మహేష్ గ్లామర్ కి హీరోయిన్లు సైతం ఫిదా అయిపోయారు.. నేరుగా అయినా మీ డైట్ ఏంటి మీ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అడుగుతారు. వాళ్లు వేసే ప్రశ్నలన్నింటికీ మహేష్ ఒకే ఒక్క స్మైల్ ఇస్తారు. మహేష్ అంత అందంగా కనిపించడానికి తన హెయిర్ కూడా ఒక కారణం.. అయితే మహేష్ హెయిర్ నాచురల్ హెయిర్ కాదని విగ్ అని సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ చెప్పారు. అయితే ఈ వార్తలపై మహేష్ స్పందిస్తూ ఒకే ఒక మాట అన్నారంట..!

Mahesh Babu finally responded about his wig
Mahesh Babu finally responded about his wig

సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావు

మహేష్ విగ్గు వాడుతున్నారని.. మహేష్ బాబు మొదట్లో సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి విగ్గులు వాడకుండానే నటించేవారు. తర్వాత కాలంలో ఆయన జుట్టు రాలడం మొదలైన తరువాత విగ్గులు వాడటం మొదలుపెట్టినట్లు చెప్పారు. తర్వాత హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం చేయించుకున్నారని.. ఈ జుట్టు చూడటానికి సహజమైన జుట్టు లాగానే అనిపిస్తుందట. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం ని బాలీవుడ్ హీరోలు కూడా అనుసరిస్తారని తెలిపారు.

ఆ నోట ఈ నోట పాకి ఈ విషయం మహేష్ బాబుకి కూడా తెలిసిందట. అయితే మహేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారని అక్కడ ఉన్న వాళ్ళందరూ మహేష్ వైపు చూశారట.. నా ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా నన్ను గ్లామరస్ తో కూడిన సినిమాల్లో చూడాలని అనుకుంటారు. వాళ్లకోసం నేను ఎంత కష్టం అయినా అనుభవించి అందంగా కనిపించడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పారని ఆయన సన్నిహితుల వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మహేష్ తను అందంగా కనిపించడానికి కఠినమైన డైట్ కూడా తీసుకుంటారని స్వయంగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.