గౌతమ్ పేరు మీదుగా 25 విమానాలు కొనుగోలు చేసిన మహేష్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పడానికి పదాలు చాలవు. ఇప్పటి తెలుగు సినిమా హీరోలలో చెప్పుకోదగ్గ నటుల సరసన చేరుతాడు మహేష్. అతడు సినిమాలతో ఎంత బిజీగా వున్నా కుటుంబాన్ని అసలు విస్మరించడు. అతని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా పేరు తెచ్చుకుంటున్నారు నమ్రత- మహేష్ బాబు. తమ ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార గురించి అందరికీ తెలిసిందే.

తండ్రికి తగ్గ వారసులు అని చెప్పుకోవాలి వారిని. ఇక వారి ఇద్దరు టాలెంట్ అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతుంటారు నమ్రత. తనయుడు గౌతమ్ ఘట్టమనేనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అచ్చం తండ్రి రూపురేఖలతో అట్రాక్ట్ చేస్తుంటారు గౌతమ్. మొన్నామధ్య ఆయనలోని ఓ టాలెంట్ బయటపడింది. తన స్కూల్లో ఓ నాటకం వేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ తల్లి నమ్రత చాలా ఎమోషనల్ అయ్యారు. స్నేహితులతో కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ తన నటనా ప్రతిభను చూపించాడు గౌతమ్.

అంతేకాకుండా కూతురు సితార డాన్స్ కి సంబందించిన వీడియోలు కూడా ఆమె ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. సితార ఆమధ్య రిలీజైన ‘శాకుంతలం’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక గౌతమ్‌ని చూసినప్పుడలా ఘట్టమనేని అభిమానులు అచ్చం మహేష్‌ బాబులా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తుంటారు. మహేష్‌ బాబు లుక్స్ కొట్టొచ్చినట్లు కానిస్తున్నాయని, మరో తరానికి కాబోతున్న టాప్ స్టార్ హీరో అని అంటూ వుంటారు. గతంలో మహేష్ బాబు- సుకుమార్ కాంబోలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో గౌతమ్ నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.

ఇక అసలు విషయానికొస్తే, సూపర్ స్టార్ మహేష్ మన ఫ్యూచర్ సూపర్ స్టార్ గౌతమ్ పేరుమీద దాదాపుగా 25 విమానాలు కొనుగోలు చేసినట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఓ కంపెనీ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపైన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది. మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని, మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో ఈ సినిమాను చాలా రిచ్‌గా రూపొందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.