Mahesh Babu Trivikram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికే వీరిద్దరి జోడి లో అతడు, ఖలేజా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాయి.. ఖలేజా సినిమా తరువాత మహేష్ బాబు కి త్రివిక్రమ్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి.. ఈ మనస్పర్థలు తొలగి వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎనౌన్స్ చేయడానికి కారణం ఈమేనట..!!2010లో ఖలేజా ఈ సినిమా తరువాత మహేష్, త్రివిక్రమ్ మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని వార్తలు అప్పట్లో బాగా వచ్చాయి.
వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదు అనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి. అన్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి పదేళ్లకు పైగానే అయింది. మహేష్, త్రివిక్రమ్ కలిసి పని చేయడం కోసం ఒక వ్యక్తి నిరంతరం రాయబారం నడిపింది. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు భార్య నమ్రత.వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా దూరమైపోతున్న తరుణంలో చాలా తెలివిగా మహేష్ బాబు ను త్రివిక్రమ్ తో కలిసి యాడ్స్ లో పనిచేసేలా చేశా

సినిమాలు చేయక పోయినా యాడ్స్ లో భాగంగా కలుస్తూనే ఉన్నారు. ఈ యాడ్స్ పుణ్యమా అని వీరిద్దరి మధ్య సన్నిహిత్యం కుదిరింది. ఆ స్నేహంతోనే ఇప్పుడు మళ్లీ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది . దానిని నిజం చేస్తూ మళ్లీ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ఎనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.