ఘట్టమనేని సితార ని చూడడానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదు.. తండ్రికి తగ్గ కూతురు గురూ.! 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మహేష్ తో పాటు తన కూతురు సితార కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకుంది.. స్టార్ కిడ్ గా సూపర్ యాక్టివ్గా సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించుకుంది.. ఇక వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.. కాగా వీళ్ళిద్దరూ కలిసి ఓ షోలో కలిసి సందడి చేయనున్నారు.. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టుంట వైరల్ అవుతుంది..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. సినిమాల తర్వాత యాడ్స్ తర్వాత బుల్లితెర లో ఆయన ఎక్కువగా కనిపించలేదు. అయితే తాజాగా జీ తెలుగు టీవీ ఛానల్ డాన్స్ షోకి గెస్ట్ గా వచ్చారు. సినీ యాక్టర్స్ ఆడియో ఫంక్షన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎంటర్టైన్మెంట్ షో ప్రమోషన్స్ కి అతిథిగా వెళ్ళటం ఇంటర్వ్యూలకు వెళ్ళటం సహజమే. కానీ ఇక్కడ మహేష్ బాబు తనతో పాటు తన కూతురిని సితారను కూడా తీసుకురావడంతో.. సినీ అభిమానులు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు తన కూతురు చేయి పట్టుకొని షూటింగ్ కి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో మహేష్ తన కూతురు చేయి పట్టుకొని నడుస్తూ కనిపించారు. మహేష్ స్టైలిష్ అవుట్ ఫిట్స్ ధరించారు.. సితార కూడా గ్లిట్టర్ ఫ్రాక్ వేసుకొని స్టైలిష్ గా రెడీ అయింది. మరి ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి. తాజాగా మహేష్ సితార ఇద్దరు కలిసి రానున్న షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ షో ఎప్పుడెప్పుడు టీవీలో టెలికాస్ట్ అవుతుందని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

Advertisement