Mahesh Babu : మహేష్ ని చూడగానే అల్లు అర్హ ఎలా రియాక్ట్ అయిందో చూడండి..

Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదిక మీద దర్శనమివ్వడం చాలా అరుదుగా.. అలా ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం అభిమానులు పండగ.. ఇటీవల టాలీవుడ్ ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. తమ అభిమానులకు కనువిందు చేశారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్హ కూడా అక్కడికి వచ్చింది.. కాగా మహేష్ బాబు ని ఒక్కసారిగా చూడగానే అల్లు అర్హ ఫేస్ రియాక్షన్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమా వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. వారి రిసెప్షన్ కి సీని రాజకీయ ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వాదించారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది. ఈ వేడుకకు మహేష్ బాబు , అల్లు అర్జున్ తో పాటు తన కూతురు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదికపై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఓవైపు బన్నీ.. మరోవైపు సూపర్ స్టార్ ఉండడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి ఫోటోను చూసిన నెటిజనులు.. వాటే కాంబినేషన్‌.. ఫోటో ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు ని చూడగానే అల్లు అర్హ కూడా స్మైలింగ్ లుక్స్ ఇచ్చింది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి అల్లు అర్హ మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ ని యాడ్ చేసి ఓ వీడియోని క్రియేట్ చేసి మళ్లీ హైలెట్ చేస్తున్నారు సోషల్ మీడియా క్రియేటర్స్.

శాకుంతలం సినిమాతో అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ వెండితెర అరంగేట్రం చేస్తోంది. అంతేకాకుండా నెక్స్ట్ సినిమా కూడా అల్లు అర్హ లైన్ లో పెట్టిందని సమాచారం ఈసారి మహేష్ బాబుతో కలిసి అల్లు అర్హత నటించిన ఉందని సమాచారం..