Mahesh Babu : పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు గతేడాది తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ మీట్ కర్నూల్ లో నిర్వహించినప్పుడు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు మహేష్ బాబు. వాస్తవానికి మహేష్ బాబు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం చాలా అరుదు. కానీ సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ లో అక్కడ ప్రజలను వారి ఉత్సాహాన్ని చూసి పర్ఫామెన్స్ ఇచ్చారు అసలు విషయంలోకి వెళితే సక్సెస్ మీట్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన నీటిలో భాగంగా మహేష్ బాబు లైవ్ పెర్ఫార్మన్స్ గురించి అక్కడ స్టూడెంట్స్ అడగడం జరిగింది.
ఒక స్టూడెంట్ మహేష్ బాబుతో తన లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతుంటే వెంటనే మహేష్ బాబు మైక్ అందుకొని కర్నూలు ప్రజలను చూసినప్పుడు ఆ ఆనందం నా మనసులో నుంచి వచ్చింది. జోష్ పెరిగింది దాంతో స్టేజ్ పైకి వెళ్లి నేను లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాను అప్పుడు డైరెక్టర్ పరుశురామ్ గారి రియాక్షన్ చూడాలి నేను నా జన్మలో అది మర్చిపోలేను. నేను స్టేజ్ పైకి వెళ్ళగానే ఆయన నోరు తెరిచే అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక పరుశురాం నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలిపారు మహేష్ బాబు.
మహేష్ బాబు సినిమా విషయానికొస్తే ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు కంతా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ కంతా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు.