Madhuri Dixit : చీర కట్టులో కుర్ర కారును కట్టిపడేస్తున్న మాధురి దీక్షిత్.. ఎంతందమో..!! 

Madhuri Dixit : మాధురి దీక్షిత్.. బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు వయసుతోపాటు అందం కూడా పెరుగుతోందని చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా డాన్స్ క్వీన్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మాధురి దీక్షిత్ ఇప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఈ వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ప్రస్తుతం సీనియర్ నటిగా మారిపోయింది. అయినా కూడా అందంలో ఏమాత్రం మార్పులు కనిపించడం లేదు.

Madhuri Dixit mesmerizing look in saree.. very pretty..!!
Madhuri Dixit mesmerizing look in saree.. very pretty..!!

ఇకపోతే ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా దీపావళి అవుట్ ఫిట్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. బ్లూ కలర్ చంకీ శారీ లో కుర్రకారును కట్టిపడేసింది. ఆంటీ వయసులో కూడా అమ్మాయిలా చెలరేగిపోతోంది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఇంత అందం ఒక మాధురి దీక్షిత్ కి మాత్రమే సొంతం అయ్యింది అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. బాలీవుడ్ సూపర్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్ నాయక్ మూవీలో చోళీ కే పీచే క్యా హై అనే పాటతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌస్.. బ్లూ కలర్ సారీ లో తన అందాలను చూపిస్తూ మరింత మెస్మరైజ్ చేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా దీపావళి అవుట్ ఫిట్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంటుంది మాధురి దీక్షిత్. ఇక ఈమె ఫోటోలని చూసి నెటిజెన్లు సైతం ఏమి అందం  అంటూ కామెంట్లు చేస్తున్నారు. దాదాపు పది సంవత్సరాలపాటు తన పాటలు, డాన్స్ , సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ నే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జిగా, కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తోంది మాధురి దీక్షిత్.