Singer Sunitha: ” మ్యాడమ్ గుడ్ న్యూస్ చెప్పండి.. కొడుకా.. కూతురా?” గోల చేస్తున్న సునీత వీరాభిమానులు..! 

Singer Sunitha:  సాధారణంగా సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రిటీల విషయాలలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అందులో నిజం ఉందా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా వైరల్ అవుతూ.. ఒకరకంగా వారిని మరింత పాపులర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ సెలబ్రిటీకి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే సింగర్ సునీత తల్లి కాబోతున్నారనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె వీరాభిమానులు..” మ్యాడమ్ గుడ్ న్యూస్ చెప్పండి.. కొడుకా.. కూతురా?” అంటూ ఆమె వీరాభిమానులు తెగ గోల చేస్తున్నారు.

Madam.. tell me good news.. Son or Daughter?
Madam.. tell me good news.. Son or Daughter?

సింగర్ సునీత తల్లి కాబోతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న ఈమె అనేక రూమర్లకు చెక్ పెట్టి.. సంతోషంగా కాలం గడుపుతోంది. మరొకవైపు తన కొడుకు ఆకాష్ ను హీరోగా చేయాలని పరితపిస్తూనే.. కూతురును సైంటిస్ట్ చేయాలని కూడా ఆలోచిస్తుంది. ఇన్ని ఆలోచనల మధ్య ఈమె మళ్లీ తల్లి కాబోతోంది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రముఖ టాలీవుడ్ బిజినెస్ మాన్ అయినా మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేనిని సునీత పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ముఖ్యంగా వీరిది ప్రేమ వివాహం.

రామ్ కూడా కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి.. అయితే నడివయసులో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు తల్లిదండ్రులు కావాలని ఆకాంక్షిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ కూడా చేయించారని.. ఆమధ్య వార్తలు రాగా ఇప్పుడు తల్లి కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అభిమానులు త్వరగా గుడ్ న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నారు.