Raghava Lawrence : వీడియో డొనేషన్ కాంట్రవర్సీలపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్..!!

Raghava Lawrence :  ప్రముఖ నటుడు మరియు దర్శకుడు లారెన్స్ అందరికీ సుపరిచితుడే. తెలుగుతోపాటు దక్షిణాది సినిమా రంగంలో అనేక సినిమాలు చేయటం జరిగింది. కొరియోగ్రాఫర్ గా కెరియర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత నటుడిగా.. దర్శకుడిగా.. ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించడం జరిగింది. ప్రస్తుతం “చంద్రముఖి 2” ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ కెరియర్ ప్రారంభం నుండి చాలామందికి తన “రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా.. ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది.

అయితే ఇటీవల తన ట్రస్ట్ కి విరాళాలు పంపించవద్దని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. అయితే లారెన్స్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల నెటిజెన్లు తప్పు పట్టారు. దీంతో డొనేషన్ కాంట్రవర్సీపై లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. “నా ట్రస్ట్ కి ఎవరు డబ్బులు పంపించవద్దు. నా పిల్లలను నేనే చూసుకుంటాను అని ట్వీట్ చేయడం జరిగింది. అయితే అలా పోస్ట్ పెట్టడానికి కారణం ఉంది. డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు 60 మంది పిల్లలతో ట్రస్ట్ మొదలుపెట్టాను. వారి బాధ్యతలు తీసుకునేందుకు ఒక్కడి ఆదాయం సరిపోక ఇతరుల సాయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్న. అందుకే ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఇతరులపై ఆధారపడటం మానేశాను. అంతేగాని పొగరుతో కాదు. నాకు ఇవ్వాలనుకున్న డబ్బులు వేరే ట్రస్టులకు, లేదా మీ ఇంటిదగ్గర నిస్సహాయులకు అందించాలని కోరుతున్నా” అంటూ లారెన్స్ వివరణ ఇచ్చాడు.