NTR – Koratala Shiva : ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఫాన్స్ కి పూనకాలే..!

NTR – Koratala Shiva రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయిన తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి తాజా బిగ్ అప్డేట్ రావడం అభిమానులకు పూనకాలను తెప్పిస్తుంది. ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్ లో ఎన్టీఆర్ను చూస్తారు అని కొరటాల శివ ఇదివరకే తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ మేనరిజం కూడా హైలెట్ కాబోతోంది. అసలు విషయంలోకి వెళ్తే .. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేతికి 6 వేళ్ళు ఉంటాయట..

Latest big update from NTR - Koratala shiva movie..!
Latest big update from NTR – Koratala shiva movie..!

కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఆరో వేలు బిగుసుకుపోతుంది అని.. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర యొక్క సీరియస్ నెస్ ను ఈ వేలుతో సింబాలిక్ గా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ లో భారీగానే ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. అందుకే ఎట్టకేలకు వచ్చే యేడాది సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా లో మైథాలజికల్ టచ్ కూడా ఉండబోతుందని సమాచారం.