Krithi Shetty : కృతి శెట్టి మళ్ళీ జన్మలో ఇలాంటి రోల్ చేయలేదు..!!

Krithi Shetty : కృతి శెట్టి.. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలలో నటించి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఈమెకు గడ్డుకాలం మొదలైందని చెప్పవచ్చు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమా రెండూ కూడా డిజాస్టర్ పాలయ్యాయి..ఇక ఈమె మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలంటే తన ముందున్న ఒకే ఒక సినిమా” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రను చూసి తర్వాత కృతి శెట్టి మళ్ళీ జన్మలో కూడా ఇలాంటి పాత్ర చేయలేదు అని స్పష్టంగా చెప్పవచ్చు.

అంత అద్భుతంగా అందరిని మించిన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ.బెంచ్ మార్క్ స్టూడియో.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై.. ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కించారు . శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న కృతి శెట్టి కూడా తన కెరియర్ లోనే మోస్ట్ మెమరబుల్ మూవీ అని కూడా తెలిపింది. అంతేకాదు దర్శకుడు తో పాటు నిర్మాతలకు , హీరోకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది కృతి శెట్టి. ఇకపోతే ఈ సినిమాలో ఈమె పాత్ర విషయానికి వస్తే..

Kriti Shetty never played a role like this again in Janma
Kriti Shetty never played a role like this again in Janma

హీరో సుధీర్ బాబు దర్శకుడిగా ఈ సినిమాలో నటించారు. తన సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతూ ఉండగా డాక్టర్ అయిన హీరోయిన్ కనిపిస్తుంది.. ఇక ఎప్పుడూ మూడీ గా ఉండే ఆ హీరోయిన్ ని తన సినిమాలో నటింప చేయాలని హీరో అనుకుంటూ ఉంటే.. హీరోయిన్ ఫ్యామిలీకి ఇలాంటివి అస్సలు నచ్చవు.. కానీ కొన్ని కండిషన్స్ తర్వాత ఒప్పుకున్నా కూడా ఆ సినిమాలో నటించకుండా హీరోయిన్ సుదీర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆ హీరో డైరెక్షన్లో హీరోయిన్ నటించిందా? ఆ హీరోకి దూరం కావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో కృతి శెట్టి నటనకు మంచి మార్కులు పడ్డమే కాకుండా తన జీవితంలోనే ఇలాంటి మాత్రం మళ్లీ దొరకదేమో అని చెప్పడంలో సందేహం లేదు.