Prabhas : కన్నతల్లి కోసం కూడా చేయలేనిది.. కృష్ణంరాజు భార్య కోసం చేసిన ప్రభాస్.!

Prabhas : రెబల్ స్టార్ అంటే ఒకప్పుడు కృష్ణంరాజు.. నేటి తరానికి ప్రభాస్ ని రెబల్ స్టార్ గా పరిచయం చేసింది మాత్రం కృష్ణంరాజే.. ఇటీవల ఆయన మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని ప్రముఖులు మీడియా ముఖంగా తెలియజేశారు.. ఇక ప్రభాస్ పరిస్థితి తో పాటు తన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇటువంటి సమయంలో ప్రభాస్ తన పెద్దనాన్న కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.. అందుకోసం ప్రభాస్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ల పెద్దమ్మ చేతులెత్తి దండం పెట్టింది..!

ప్రభాస్ ఇప్పటికే మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు ఆది పురుష సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలర్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.. సడన్ గా కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ అన్ని సినిమా షూటింగ్లను దాదాపు 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్స్ కి చెప్పాడట.. ప్రశాంత్ నీల్ కి నాగ అశ్విన్ కి మారుతీకి మూడు నెలల పాటు ఎటువంటి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోవద్దని ప్రభాస్ కరాకండిగా చెప్పేసాడట.. అన్ని పెద్ద పెద్ద సినిమాలు కావడంతో మిగతా యాక్టర్స్ షెడ్యూల్ కాల్ షీట్ మళ్ళీ తీసుకోవాలి.. పైగా బోలెడంత డబ్బు నష్టం వస్తుంది డైరెక్టర్స్ కి..

Krishnam Raju wife shyamala devi emotional on Prabhas
Krishnam Raju wife shyamala devi emotional on Prabhas

ఈ మూడు నెలల్లో ప్రభాస్ కృష్ణంరాజు పూర్తి చేయాల్సిన పనులను ఇంటి పెద్దదిక్కుగా బాధ్యత తీసుకొని.. కృష్ణంరాజు కూతుర్లను లైఫ్ లో సెట్ చేయాలని ఆలోచిస్తున్నారట ప్రభాస్. ఇప్పటివరకు ఇంటి పెద్దగా ఉన్న కృష్ణంరాజు ఇకపై పోవడంతో ప్రభాస్ పెద్ద దిక్కుగా మారి చెల్లెల పెళ్లిపై దృష్టి పెట్టడంతో.. శ్యామలాదేవి ప్రభాస్ కి చేతులు జోడించి దండం పెట్టేసిందట.. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నువ్వే నా కొడుకు అంటూ ఎమోషనల్ అయిందంట.. ప్రభాస్ తనకు నష్టం వచ్చినా కూడా పర్వాలేదు అనుకుని.. పెద్దనాన్న ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం చూసి వాళ్ళ పెద్దమ్మ శ్యామల దేవి బాగా ఎమోషనల్ అయ్యారట.. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..