KGF : కేజీఫ్ యశ్ అభిమానులు సేల్ఫీ కోసం వస్తే ఇలా చేశాడా.!?

KGF : సాధారణంగా సినీ తారలు ఎవరైనా కనిపిస్తే వెంటనే ఎవ్వరైనా ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు అనుకుంటారు. అలాంటిది ఒక అభిమాన హీరో కనిపిస్తే ఎగబడి మరి సెల్ఫి తీసుకుంటారు.. హీరోలను ఫ్యాన్స్ పెడితే మాత్రం ఫోటో షూట్స్ కు ఆసక్తి చూపించరు. అభిమానులు అని కూడా చూడకుండా అక్కడ నుండి వెళ్లి పోవడం మనం చూస్తూ ఉంటాం. కొందరు సెల్ఫీ లు తీసుకుంటూ ఉంటే ఫోన్ లాక్కోవడం జరుగుతుంది.. కానీ కేజిఎఫ్ హీరో యశ్ అందుకు భిన్నం..

Advertisement

Advertisement

సాధారణంగా పది మంది తో సెల్ఫీలు దిగిన వెంటనే చాలా మంది స్టార్స్ కి ఓపిక తగ్గుతుంది. ఇక ఎంతమంది అభిమానులు ఉన్నా కూడా అక్కడ నుండి వెళ్లి పోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కేజీఎఫ్ స్టార్ యశ్ మాత్రం ఏకంగా 700 మంది తో సెల్ఫీలు దిగి అందరిని ఆశ్చర్యపర్చాడు. తాజాగా బెంగళూరులో ఒక ఈవెంట్ లో పాల్గొన్న రాఖీ భాయ్ యశ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సందర్భంగా అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇక ఆ నిర్వాహకులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా కూడా యశ్ మాత్రం వారితో ఫొటోలు దిగేందుకు ఓకే చెప్పాడు.

తమ అభిమాన హీరో యశ్ తో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం తో అక్కడ నుండి వెళ్లారట. ఈ మధ్య కాలంలో ఇలా ఏ ఒక్క హీరో కూడా అభిమానులకు సెల్ఫీ లు ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో యశ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Advertisement