Kantara Movie : మూడు రోజుల కాంతారా కలక్షన్ లు ఎంతో తెలుసా.. ఈ డబ్బుతో అల్లూ అరవింద్ ఇంకొక ఆహా పెట్టచ్చు ?

Kantara Movie : సైలెంట్‌గా వ‌చ్చి తెలుగు నాట సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతారా. ఈ కాంతారా అంటే అర్దం ఎవ‌రికి తెలియ‌దు. ఇందులో న‌టించిన‌ రిష‌బ్ షెట్టిని మునుపు చూసింది లేదు. థియేట‌ర్లు మొద‌టి ఆట నుంచి ఫుల్ న‌డుస్తున్నాయి. ఏముంది “కాంతారా”లో. కొత్త క‌థేం కాదు. గ్రామ రాజ‌కీయాలు, అడ‌వి నేప‌థ్యంతో ఉంది. రంగ‌స్థలం, పుష్ప క‌లిస్తే ఈ సినిమా అన్న‌ట్టుగా ఉంది. అయితే ఈ సినిమా అంత హిట్ కావ‌డానికి కార‌ణం ఏంటంటే.. మొద‌టి 15 నిమిషాలు, ఆఖ‌రి 15 నిమిషాలు అద్భుతం, బీభ‌త్సంగా ఉండ‌డ‌మే. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా మూవీ విడుద‌లైంది.

శని, ఆదివారాల్లో పెద్ద పెద్ద సింగిల్ స్క్రీన్లలో కూడా ‘కాంతార’ హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ కావ‌డంతో ఆదివారం స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చిత్రం తెలుగులో తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ‘కేజీఎఫ్-2’ కూడా ఇలాగే తెలుగులో సంచలనం రేపింది కానీ.. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ‘కాంతార’ ఇలాంటి ఘనత సాధించడం మాత్రం గొప్ప విష‌య‌మే. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును టచ్ చేయడం విశేషం. ఫుల్ రన్లో ‘కాంతార’ రూ.20 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని, వరల్డ్ వైడ్ గా ఈ సినిమా వసూళ్లు రూ.100 కోట్ల మార్కును టచ్ చేయ‌డంలో ఆశ్చ‌ర్యం ఏమి లేద‌ని అంటున్నారు.

Kantara Movie three days collections
Kantara Movie three days collections

Kantara Movie : దూసుకెళుతున్న కాంతారా..

మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది.మొదటి రెండు రోజుల్లోనే 11 కోట్లకి పైగా ఒక్క తెలుగు భాషలోనే వసూలు చెయ్యగా ఇప్పుడు మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ ని అందుకొని మూడు రోజుల్లో 16.5 కోట్లు అందుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ వ‌సూళ్ల‌ని చూస్తే కాంతారా తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ కొనుగోలు చేసిన అల్లు అర‌వింద్ మ‌రో ఆహాని స్టార్ట్ చేయ‌వ‌చ్చు అని అంటున్నారు. ఏదేమైన కాంతారా ప్ర‌భంజ‌నం మాత్రం మాములుగా లేద‌నే చెప్పాలి. తెలుగులో 2 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 2.30Cr బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రెండు రోజుల్లోనే డబుల్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిందంటే ఈ సినిమా హ‌వా ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు.