Kantara : నాలుగవ రోజు ఊచ కోత – కాంతార నాలుగు రోజుల కలక్షన్స్ తో అల్లూ అరవింద్ కి డబ్బే డబ్బు !

Kantara : కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి హీరోగా… స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా.. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లతో ఊచ కోత కోస్తోంది. భారీ కలెక్షన్ లతో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించి దుమ్ము దుమారం లేపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కన్నడ సినిమా అయినా.. కన్నడ ఇండస్ట్రీలో విడుదలై 17 రోజులలో సంపాదించిన కలెక్షన్స్.. తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే రాబట్టడం విశేషం. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది.

Advertisement
kantara day 4 collections
kantara day 4 collections

ఇక సినిమా అన్నిచోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఇకపోతే నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి వర్కింగ్ డే టెస్టును ఎదుర్కోగా.. మొత్తం మీద రూ.1.40 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ రూ.1.45 కోట్ల మార్క్ అందుకొని దుమ్ము లేపగా. గ్రాస్ ఆల్మోస్ట్ రూ.2.50 కోట్ల రేంజ్ లో ఉండడం ఆశ్చర్యకరమైన చెప్పాలి. ఇకపోతే టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల కలెక్షన్స్ గమనిస్తే..

Advertisement

నైజాం – రూ. 3.60 కోట్లు

సీడెడ్ – రూ.1.10 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.1.06కోట్లు

ఈస్ట్ గోదావరి – రూ. 70 లక్షలు

వెస్ట్ గోదావరి – రూ. 42 లక్షలు

గుంటూరు – రూ.54 లక్షలు

కృష్ణ – రూ. 48 లక్షలు

నెల్లూరు – రూ.35 లక్షలు సాధించినట్లు సమాచారం.

ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ. 8.25 కోట్లు కలెక్షన్ సాధించగా.. రూ. 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.30 కోట్లు కాగా దీనిమీద ఏకంగా రూ.5.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకొని.. ఊహకందని లాభాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత అల్లు అరవింద్ కు పావలా పెట్టుబడికి పది రూపాయల లాభం అన్నట్టుగా ఉంది. ఇక కాంతారా సినిమా కలెక్షన్లతో నిర్మాత అల్లు అరవింద్ కు డబ్బే డబ్బు.

Advertisement