మహేష్ బాబు యాక్టింగ్ ఇష్టమన్న లోకనాయకుడు కమల్ హాసన్?

టాలీవుడ్ అందగాడు, ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. తెలుగులో చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణకు వారసుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు. మురారి, అతడు, పోకిరి వంటి సినిమాలతో తెలుగునాట ప్రభంజనం క్రియేట్ చేసాడు. ఎత్తుకి ఎత్తు, అందానికి అందం, నటనకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మహేష్ అంటే అభిమానులు పడి చస్తారు. మరీ ముఖ్యంగా తెలుగులో లేడీ ఫాన్స్ ఎక్కువగా వున్న నటుడు మహేష్.

అలాంటి మన సూపర్ స్టార్ ని నటనకే నటన నేర్పేటువంటి లోకనాయకుడు కమల్ హాసన్ ఓ వేడుకలో ఆకాశానికెత్తేశారు. ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ… తెలుగులో తనకి చాలామంది నటులు బాగా క్లోజ్ అని, వారితో అప్పుడప్పుడు టచ్ లో ఉంటానని చెప్పుకొచ్చారు. హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు తనకు బాగా పరిచయం అని అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మహేష్ బాబు గురించి ఆయన మాట్లాడారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అని, అతని సినిమాలు చాలా బావుంటాయని, ఆ సినిమాలు చూశానని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘట్టమనేని అభిమానులు సంబరాలలో మునిగిపోయారు. మా హీరోనే తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాక్షాత్తు కమల్ హాసన్ అలా అనడంతో వారి ఆనందానికి అవధులే లేవు.

ఇకపోతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. SSMB 28గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైన అభిమానులు అంచనాలు చాలా గట్టిగానే పెట్టుకున్నారు. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు అదే జోష్ లో మన మాటల మాంత్రికుడితో జత కట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న త్రివిక్రమ్.. ఇప్పుడు ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ను కీలక పాత్రలో తీసుకున్నారని వినికిడి.