AMIGOS : కళ్యాణ్ రామ్ అమిగోస్ రివ్యూ – ఇంటర్నెట్ లో మొట్టమొదటి రివ్యూ – భూమి దద్దరిల్లే బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి బిడ్డ !

AMIGOS : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఈ చిత్రం పై అంచనాలను పెంచేశాయి.. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటిస్తోంది.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు థియేటర్స్ లో విడుదలైంది.. ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. మరోసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నడో లేదో చూద్దాం..

Kalyan Ram amigos first review
Kalyan Ram amigos first review

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు అమిగోస్ అంటే స్పానిష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్ అని అర్థం. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పాలంటే.. ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని సామెత ఉంది. అమిగోస్ సినిమాలో ప్రతి ఒక్కరూ తమలా ఉండే వ్యక్తులను కలిసే సాఫ్ట్వేర్ ని హీరో డెవలప్ చేస్తారు. ఈ క్రమంలో తాను తనలా ఉన్న మరో ఇద్దరిని కలుస్తాడు.. తాను కలిసి ఆ ఇద్దరు ఎవరు వారి నేపథ్యాలు ఏమిటి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది కథ.. ఈ సినిమా ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో అమిగో మంచి సినిమా అని అంటున్నారు.

ప్రేక్షకులను అలరించే యాక్షన్ త్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని.. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉందని అభిప్రాయం తెలుపుతున్నారు. త్రిపాత్రాభినయంలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటున్నారు అని చెబుతున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో వైవిధ్యం చూపిస్తూ మెప్పించారని వీక్షకుల టాక్. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు మరో హైలెట్.. సెకండ్ హాఫ్ లో వచ్చే బాలయ్య రీమిక్స్ సాంగ్ ఎన్నో రాత్రులు వచ్చాయి కానీ .. ఈ చిత్రానికి ప్లస్ అయిందని. ఈ పాట చాలా బాగుంది అని చెబుతున్నారు.

జీబ్రాన్ బిజిఎం సినిమాకు మైనసాని పిలిచిందని చెబుతున్నారు. బలహీనమైన స్క్రీన్ ప్లే ఆసక్తి లేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా చిత్రానికి డీసెంట్ టాక్ ఉంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు అని ఎక్కువ మంది చెబుతున్నారు.