BREAKING : కే విశ్వనాధ్ చనిపోవడానికి 2 గంటల ముందు ఎం జరిగిందో తెలుసా ? నమ్మలేరు మీరు

BREAKING : కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 2 1980 లో వచ్చిన సినిమా శంకరాభరణం.. నిన్నటితో ఈ సినిమా విడుదల అయ్యి 43 ఏళ్లు.. ఆ సందర్భంగా విశ్వనాథ్ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను గుర్తుచేసుకొని ఆనందించారట.. ఆయన చనిపోయే రెండు గంటల ముందు ఈ సినిమాను ఆయన ఇంట్లోనే బిగ్ స్క్రీన్ పై చూసి ఆనందంతో మురిసిపోయారట.. ఇక ఇదే ఆఖరి సారి ఈ సినిమా చూస్తానని ఆయన అనుకోలేదు.. అనూహ్యంగా అందరిని ఆయన మాయలో పడేసి ఏకాకిగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..

Kalatapasvi viswanadh shankarabaram watching on last few hours ago
Kalatapasvi viswanadh shankarabaram watching on last few hours ago

సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2వ తేదీన శంకరాభరణం విడుదలైన అదే రోజున కే విశ్వనాథ్ కూడా కన్నుమూశారు. తన కెరీర్ ను అద్భుతమైన స్థాయికి తీసుకువెళ్లిన ఈ సినిమా విడుదలైన రోజే కళాతపస్వీ కన్నుమూయడం నిజంగా విశేషంగా చెప్పాలి. దర్శకుడుగా ఆయన ఎన్ని సినిమాలు రూపొందించిన విశ్వనాథ్ కు కళాతపస్వి అన్న పేరుని సంపాదించి పెట్టింది మాత్రం శంకరాభరణం సినిమానే.. ఈ చిత్రానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చాయి. 1981లో ఫ్రాన్స్ లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా ఈ చిత్రం అందుకుంది.

అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే గొప్ప సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలైన ముందు అంతా పెదవి విరిచారు. కానీ మౌత్ టాక్ తో శంకరాభరణం శత దినోత్సవాలు, రజదోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళలోనూ శంకరాభరణం సినిమా ఘన విజయం సాధించింది. దేశ విదేశాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. అంతటి చరిత్రను విశ్వనాథకు సొంతం చేసిన శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి రెండో తేదీన ఆయన తను చాలించడం దైవికం అనే చెప్పాలి. ఆయన తనువు చాలించే రెండు గంటలు ముందు కూడా ఈ సినిమా చూడడం.. ఆ సినిమా తీసినప్పుడు జరిగిన సన్ని వేశాలను తలుచుకుని ఆయన అందించరట.