Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ సమంత క్రేజ్ ను బీట్ చేసిందా అంటే నిజమే అంటుంది గూగుల్ సెర్చింగ్.. తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చింగ్ లో టాప్ లో నిలిచిన హీరోయిన్స్ లిస్టు బయటకు వచ్చింది.. విడ్డూరం ఏంటంటే ఆల్రెడీ పెళ్లి అయ్యి పిల్లను కానీ ఫేడవుట్ అయిపోయిన కాజల్ గతేడాదిలాగానే ఫస్ట్ ప్లేసులో నిలవడం గమనార్హం.. ఇక సమంత ను మళ్ళీ వెనక్కి వెళ్ళింది..

గత ఏడాదిన్నర క్రితం వరకు సోషల్ మీడియాలోనూ, ఇంటర్నెట్ సెర్చింగ్‌లోనూ సమంత కు తిరుగులేని పాపులారిటీ ఉండేది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ తో బాధ పడటం.. భారీ అంచనల మధ్య విడుదలైన యశోద కమర్షియల్ ప్లాప్ అవ్వడం.. గుణశేఖర్ శాకుంతలం కూడా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం.. విజయ్ దేవరకొండతో చేస్తోన్న ఖుషి మధ్యలో ఆగింది. ఈ ప్రభావాలే సమంత పట్ల ఉన్న క్రేజ్ తగ్గడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి..
కాజల్ చేతిలో సమంతకు ఉన్నన్న సినిమా ఆఫర్స్ లేవు. ఇంకా చెప్పాలంటే సమంతకు ఉన్నంత కాంట్రవర్సీలు కూడా లేవు. కాజల్ పెళ్లి, బాబుకు జన్మినవ్వడం లాంటి విషయాలతో పాపులర్ అయింది. సమంత క్రేజ్ కాజల్‌తో పోల్చినా రెండో ప్లేస్‌కు పడిపోయింది. ఇక ఈ యేడాది గూగుల్ సెర్చింగ్‌లో టాప్ 1 కాజల్, టాప్ 2 లో సమంత నిలవగా.. మిగతా స్థానాలలో వరుసగా మూడో స్థానంలో రష్మిక, నాలుగో స్థానంలో తమన్న నిలిచారు.. 5వ ప్లేస్ లో నయనతార, 6లో అనుష్క, 7వ స్థానంలో పూజాహెగ్డే, 8వ ప్లేస్ లో కీర్తిసురేష్, 9లో సాయిపల్లవి, 10లో రకుల్ ప్రీత్ నిలిచారు..