Kaikala Satyanarayana : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కమెడియన్ గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 777 చిత్రాల్లో నటన కైకల సత్యనారాయణ అద్భుతం.. కైకాల సత్యనారాయణ చివరి కోరిక ఒకటి ఉంది అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అదేంటంటే.!?

మల్టీస్టారర్ చిత్రాలలో నటించాలని కైకాల సత్యనారాయణ అనుకునే వారట. అలాగా ఆ కాలంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో కైకాల సత్యనారాయణ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత జనరేషన్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తే.. ఆ సినిమాల్లో కూడా ఆయన నటించాలని అనుకున్నారట.. కానీ ఆ కోరిక ఇప్పటి వరకు తీరకుండానే ఆయన మరణించారు. ఇక ఇటీవల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఆ సినిమా చూసిన కైకాల సత్యనారాయణకు ఎంతో ఆనందం కలిగింద. ఇలాంటి కాంబినేషన్ లోనే చిరంజీవి, బాలకృష్ణతో కలిసి నటిస్తే బాగుండుద్దని తన సన్నిహితులతో అప్పుడే చెప్పినట్లు తెలుస్తోంది.