Chandramukhi 2: 2005వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్… జ్యోతిక కలిసి నటించిన “చంద్రముఖి” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగుతోపాటు తమిళ్లో రిలీజ్ అయింది. రెండు భాషలలో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఎప్పటినుండో దర్శకుడు పి.వాసు చంద్రముఖి సీక్వెల్ చేయడానికి రజనీకాంత్ తో చాలా డిస్కషన్ జరిగిన సెట్స్ మీదకి వెళ్లలేదు.
చివరాఖరికి లారెన్స్ తో “చంద్రముఖి 2″చేయటం జరిగింది. ఈ క్రమంలో చంద్రముఖి పాత్రలో హిందీ నటి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించడం జరిగింది. దీంతో 25 లో వచ్చిన చంద్రముఖి సినిమాలో లక లక అంటూ అలరించిన జ్యోతిగా తాజాగా కంగనా చంద్రముఖిగా నటించడంపై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తారీకు విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ కి జ్యోతిక శుభాకాంక్షలు తెలియజేసి.. కంగనా నీ ప్రశంసించింది.
ఆమె గొప్ప నటి అని చంద్రముఖిగా ఈసారి కంగనా నటించడం గర్వంగా ఉందని పేర్కొంది. చంద్రముఖి లుక్ లో కంగనా చాలా అద్భుతంగా ఉందని . ఆమె నటనకు తాను అభిమానిని జ్యోతిక స్పష్టం చేసింది. ఇదే సినిమాలో చంద్రముఖి 2 చూడటానికి దాని ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు.. చెప్పుకొచ్చింది. కచ్చితంగా సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జ్యోతిక తన పోస్టులో.. సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.