Singer Sunitha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఒక పాట పాడింది అంటే సంగీత ప్రియులు పరవశించి పోవాల్సిందే.. చిన్నపిల్లలు సైతం ఈమె పాట విని హాయిగా నిద్రపోతారు అనడంలో సందేహం లేదు. అంతలా తన అద్భుతమైన గానామృతంతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిజంగా ప్రేక్షకులను మైమరిపింప చేసే అద్భుతమైన పాటలను పాడడానికే ఆ దేవుడు సునితను పంపించాడేమో అన్నట్టుగా తన అద్భుతమైన గొంతుతో శ్రోతలను అలరిస్తూ ఉంటుంది.

ఇకపోతే ఎప్పటికప్పుడు అభిమానులను మెప్పించే ప్రయత్నంలో.. వన్ యూనిట్ మ్యూజిక్ పేరిట ఇటీవల “రాయభారమై” సాంగ్ రిలీజ్ చేసి ఎంత సక్సెస్ పొందిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే మరొక పాటకు తెరలేపింది ఈ ముద్దుగుమ్మ “మానస సంచరరే ” అనే పాటను రీమిక్స్ చేస్తూ తనదైన స్టైల్ లో పాటకు ప్రాణం పోయడానికి సిద్ధమయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. సునీత నవంబర్ 14వ తేదీన ఫుల్ వీడియోను విడుదల చేస్తానని కూడా ఆ పోస్టులో తెలియచేసింది. ప్రస్తుతం సునీత పెట్టిన ఈ వీడియో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది అంతేకాదు నవంబర్ 14న రిలీజ్ చేసే ఈ పాట కోసం ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
నవంబర్ 14 ఎలాగో చిల్డ్రన్స్ డే కాబట్టి.. శ్రోతలను అలరించడానికి అలాగే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో భాగంగా ఇలాంటి వీడియోను విడుదల చేయబోతున్నారు.. ఈ వీడియో తన భర్త రామ్ వీరపనేని వీడియో సంస్థ అయిన మ్యాంగో వీడియో సంస్థ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ వీడియో ద్వారా సునీత ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటుందో చూడాలి.
View this post on Instagram