Junior NTR : తారక్ లో ఈ టాలెంట్ ఉందని మీకు తెలుసా..!?

Junior NTR : తెలుగు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్ , వాక్చాతుర్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తారక్ లో ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయని.. అవి బాగా దగ్గరైన వారికి మాత్రమే తెలుస్తాయని.. దర్శక ధీరుడు రాజమౌళి ఒక టీవీ షో కి ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు మాట్లాడారు..! బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త సినిమాని సౌత్ ఇండియాలో దర్శక ప్రజెంట్ చేసేందుకు ధీరుడు రాజమౌళి నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శక ధీరుడు బుల్లితెర షోష్ కి వస్తు తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ మాటలపై వచ్చిన ఒక అరుదైన మాటను అది కూడా తారక్ టాలెంట్ గురించి చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబాయి వెళ్ళినప్పుడు. రణబీర్ కపూర్ కలవడం జరిగింది.. ఆ సమయంలో రణబీర్ కపూర్ రాక్ స్టార్ మూవీ జరుగుతుంది. తారక్ ఈ మూవీ పాటల్ని ప్లే చేయవలసిందిగా రణబీర్ ని కోరాడు..

Junior NTR sing a song on stage show in Bollywood
Junior NTR sing a song on stage show in Bollywood

అతను అలాగే ప్లే చేయించాడు.. తన సినిమా పాటల్ని లిరిక్స్ తో సహా రణవీర్ గుర్తుపెట్టుకుంటాడు.. లేదో తెలీదుగానీ తారక్ మాత్రం స్టేజిపై రాక్ స్టార్ పాటను పాడి అక్కడ ఉన్న సినీ అభిమానులందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు.. దీంతో తారక్ కి ఏదైనా ఇష్టం అయితే దాన్ని తన మైండ్ లోనే ఉంచుకుంటాడని ఎప్పటికీ మర్చిపోడని నేను ఆరోజు తెలుసుకున్నానని దర్శకధీరుడు చెప్పాడు. తారక్ ఏదైనా అనుకుంటే అది చేయకుండా వదిలిపెట్టడు.. తనకు నచ్చిన ఏ పనినైనా సరే ఇష్టంగా పూర్తి చేస్తాడు పైగా ఏకసంతాగ్రహి కూడా.. ఈ విషయం తెలుసుకున్న తారక అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు..

Advertisement