Allu Arjun – NTR : ఏప్రిల్ 8వ తారీఖు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు బర్తడే విషెస్ తెలియజేశారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే పుష్ప సెకండ్ పార్టీ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. స్పెషల్ వీడియోలో బన్నీ లుక్.. డైలాగులు మొదటి పార్ట్ కంటే మరి పవర్ ఫుల్ రేంజ్ మాదిరిగా సుకుమార్ చూపించడం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… సెకండ్ పార్ట్ పుష్ప వీడియో చాలా బాగుందని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా బంధుత్వ పరంగా అల్లు అర్జున్, చరణ్ బావ బామ్మర్దులు అని అందరికీ తెలుసు. అయితే పుట్టినరోజు సందర్భంగా చరణ్ కేవలం హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అని నార్మల్ గా పోస్ట్ పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాత్రం హ్యాపీ బర్త్ డే బావ… ఈరోజు బాగా ఎంజాయ్ చెయ్ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ సో మచ్ బావ నీ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు అని రిప్లై కామెంట్ పెట్టడం జరిగింది. అయితే వెంటనే తర్వాత ఎన్టీఆర్ పార్టీ లేదా పుష్ప అని.. పోస్ట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ వస్తున్నా అంటూ రిప్లై ఇవ్వటం జరిగింది. దీంతో సొంత బావైనా చరణ్ కంటే ఎన్టీఆర్ బాగా చనువుగా.. హృదయపూర్వకంగా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చేశారని అంటున్నారు.
ఒక విధంగా తారక్… చరణ్ పరువు తీసేసారని సోషల్ మీడియాలో నేటిజన్స్ టాక్. మరోపక్క చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ కనీసం విషెస్ కూడా తెలియజేయలేదని చరణ్ ఫ్యాన్స్ ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరి సినిమాల డైలాగులు మరొకరు.. తారక్, బన్నీ చెప్పుకోవటం ఇద్దరు హీరోల అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.