Mahesh Babu మహేష్ బాబు ని చూస్తే ఈర్ష్య కలుగుతోంది – జాన్వి కపూర్..!

Mahesh Babu బాలీవుడ్ బ్యూటీ ప్రముఖ దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో గత ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్నామే.. అక్కడ అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తన నటనతో అందంతో అందరిని తొలగించింది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా రకరకాల ఫోటోషూట్లతో యువతకు అందాల విందు చేస్తోంది.

 

ముఖ్యంగా యువతను ఆకట్టుకునే పనిగా డిజిటల్ మనీ కోసం కూడా ఈమె ఇలా వయ్యారాలు వలకబోస్తూ రకరకాల ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట పెడుతోంది. ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు లభించాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో అవకాశం దక్కించుకుంది జాన్వి కపూర్.. అంతే కాదు ఈ సినిమా కోసం 4 కోట్ల రూపాయల వరకు పారిపోషకం అందుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలే కాలేదు.. అప్పుడే రాంచరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఒక్క సినిమాతోనే భారీ డిమాండ్ పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా కోసం 5 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం.

 

ఇకపోతే టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబు ఏజ్ పై స్పందించింది. మహేష్ బాబు గురించి మీ మాటల్లో చెప్పండి అని యాంకర్ అనగా మహేష్ బాబుని చూస్తుంటే నాకు ఈర్ష కలుగుతుంది.. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అతడు వయసులో నాకంటే చిన్నవాడేమో అని .. అతడి వయసు పెరిగే కొద్దీ అందం కూడా అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది అంటూ జాన్వి కపూర్ మహేష్ బాబు అందంపై పలు కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.