Mahesh Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా టికెట్ ధరల ఇష్యూపై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చిరంజీవి నాయకత్వంలో సీఎం జగన్ ముందు ఉంచారు. అయితే ఈ ప్రతిపాదనలకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేశారు టాలీవుడ్ ప్రముఖులు. అప్పుడే జగన్ విశాఖ ఫిల్మ్ సిటీ అంశం తెరపైకి తీసుకువచ్చారు. ఈ అంశంపై మహేష్ బాబు కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.ఫిల్మ్ సిటీ అంటే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకువస్తుంది. తమిళనాడులో జయలలిత ఫిల్మ్ సిటీ ఉంది. ఇక వీటితో పాటు ఎన్నో స్టూడియోలు తమిళ నాట ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అవడానికి ముందూ తరువాత అనేకం వచ్చాయి.
ఒక విధంగా ఉమ్మడి ఏపీకి సినీ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇపుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. చిత్ర పరిశ్రమను విశాఖ తీసుకురావాలంటే చాలానే చేయాలి.మరి ఆ పని ఒక మహా యాగం. ఎంతో పట్టుదల, సంకల్పం అవసరం. ఇపుడు యువ ముఖ్యమంత్రి జగన్ ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. విశాఖలో సినీ రాజధాన్ని అభివ్రుధ్ధి చేయడానికి ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ ని కూడా తయారు చేసుకున్నారు. విశాఖలో వేయి ఎకరాల్లో బ్రహ్మాండమైన ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లుగా ఆయనే స్వయంగా తెలిపారు. విశాఖలో పాలనా రాజధాని పెడుతున్న నేపధ్యంలో ఎక్కడ ఏమేమి ఉండాలన్న దానిపైన ప్రభుత్వం కచ్చితమైన ఆలోచనల్లో ఉంది. విశాఖకు చిత్ర పరిశ్రమను తీసుకురావడమే కాదు, మొత్తం సౌత్ ఇండియాకే తలమానికంగా నిలిచేలా చూడాలనుకుటోంది.
ఇందుకోసం ఏకంగా వేయి ఎకరాలను విశాఖలో కేటాయిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అదే విధంగా విశాఖలో స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చేవారికి కూడా పెద్ద ఎత్తున స్థలాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిధ్ధంగా ఉంది. ఇప్పటికే విశాఖలో 35 ఎకరాల్లో రామానాయుడు ఫిల్మ్ సిటీ ఉంది. ఇది రెండు దశాబ్దాల క్రితం కట్టారు నాడు ముందు చూపుతోనే స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించారు. ఇపుడు దానికి తోడుగా మరింతమంది సినీ ప్రముఖుల స్టూడియోలు కూడా వస్తాయని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఫ్యూచర్లో దక్షిణ భారతాన అతి పెద్ద సినీ రాజధానిగా విశాఖ ఉంటుందని స్పష్టంగా చెప్పడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అదే కనుక నిజమైతే మాత్రం విశాఖ ఊహించని ఎత్తుల్లో ఉంటుందన్నది వాస్తవం.
ఈ మాటలకు జగన్ కి సపోర్టుగా నిలుస్తూ మహేష్ బాబు మాట్లాడారు. మీరు తీసుకొచ్చిన ఐడియా మంచిదని.. తప్పకుండా మేము అందరం సహకరిస్తామని మహేష్ అన్నారు. కచ్చితంగా విశాఖ రావాలనుకునే ప్రతి ఒక్కరికి గెస్ట్ హౌస్ కట్టించి ఇస్తామని మహేష్ కి జగన్ హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న మిగతా వాళ్లంతా కూడా పాజిటివ్ గా రియక్ట్ అయ్యారు.