Jabardasth : వారిని నమ్మి ఉన్నదంతా పోగొట్టుకున్న జబర్దస్త్ కమెడియన్..!!

Jabardasth : బుల్లితెరపై ప్రచారం అయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో ఎంతో మంది కమెడియన్లు ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. కానీ వారి నిజ జీవితంలో మాత్రం వీరు మోయలేనన్ని కష్టాలు, బరువులు ఉంటాయని ఎంతోమంది కమెడియన్స్ సైతం పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ లో కమెడియన్ లేడీ గెటప్ లో అందర్నీ ఆకట్టుకున్న వినోద్ గురించి పలు విషయాలు తెలుసుకుందాం.

Advertisement
Jabardast comedian lost his money..!
Jabardast comedian lost his money..!

జబర్దస్త్ లో లేడీ గెటప్పుల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వినోద్ ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందుకు కారణం తనకి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా బాగా చెప్పి పోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వినోద్. అయితే తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఒక వ్యక్తి నమ్మించి మోసం చేసి తీసుకున్నారని తెలియజేశారు.

Advertisement

కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఉద్దేశంతో పైసా పైసా కూడా పెట్టిన డబ్బుతో పాటు తన తల్లి దగ్గర దాచుకున్న డబ్బుని , తండ్రి దగ్గర ఉన్న డబ్బును తీసుకొని తన కొత్త ఇల్లు తీసుకొని యజమానికి అడ్వాన్స్ కింద రూ.13 లక్షలు ఇవ్వగా అందులో రూ .10 లక్షలు ఇచ్చినట్లు ప్రూఫ్ ఉంది . మూడు లక్షలు కేవలం నోటిమాట ద్వారా ఇచ్చాను.. తనకు ఆ ఇంటి యజమాని మీద సందేహం వచ్చి డబ్బు తిరిగి ఇచ్చేయమని అడగగా అతను తనకి అసలు డబ్బే ఇవ్వలేదని పొమ్మని గెంటేశారట. ఈ విషయంపై ఇప్పటికి న్యాయం జరుగుతుందని తిరుగుతూనే ఉన్నానని తెలియజేశారు వినోద్.

Advertisement