Samantha : ట్రెండీ టాక్: సమంత వల్లే విజయ్ దేవరకొండ ఇబ్బంది పడుతున్నారా.. ఏమైందంటే..?

Samantha : సమంత.. విజయ్ దేవరకొండ.. తాజాగా కలిసి నటిస్తున్న ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఖుషీ. ఇక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిపివేయబడింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం సమంత అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత చేసిన పనికి విజయ్ దేవరకొండ కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ఇక ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణం సమంతా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా స్కిన్ ప్రాబ్లం తో బాధపడుతున్న విషయం తెలిసిందే.. సమంత ఒకసారి ఎండకు బయటకి వస్తే చాలు ఆమె శరీరంపై బొబ్బలు రావడం మొదలవుతాయి. అందుకే ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా అమెరికాకు వెళ్లి నెల రోజులపాటు అక్కడే ఉండి సమస్యను సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక తాను అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇండియాకి వచ్చి ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనబోతోందట.

Is Vijay Devarakonda in trouble because of Samantha
Is Vijay Devarakonda in trouble because of Samantha

ఇక విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెంటనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది కానీ ఇదివరకే ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఖుషీ సినిమా కూడా లైన్లో ఉన్న నేపథ్యంలో లైగర్ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జనగణమన సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ కూడా తన కొడుకు ఆకాష్ పూరితో ఒక సినిమా చేయబోతున్నారు. కానీ ఇప్పుడేమో ఖుషి సినిమా కూడా సమంత వల్ల ఆగిపోవడం వల్ల అటు వేరే సినిమా లేక ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంటుంది.

Advertisement